Home
Mobile

Nothing phone 2a Plus నథింగ్‌ నుంచి ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ వెల్లడి.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్‌ నుంచి గతంలో ఫోన్‌ 2a విడుదల అయింది. తాజాగా ఈ సంస్థ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటన చేసింది. నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ వేరియంట్‌ను (Nothing Phone 2a Plus Smartphone) లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపింది. కొత్త ఫోన్‌ను ఈనెల 31 వ తేదీన విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. తన సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఎటువంటి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల గురించి సమాచారం వెల్లడించలేదు.

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ వేరియంట్‌ ఇటీవల టెలికమ్యూనికేషన్స్‌ డిజిటల్‌ గవర్నమెంట్‌ రెగ్యూలేటరీ అథారిటీ మరియు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే గ్లోబల్‌ వేరియంట్‌ జులై 31 న విడుదల కానుండగా.. భారత్‌ లో ఎప్పుడు విడుదల కానుందనే వివరాలు వెల్లడించలేదు.

Nothing phone 2a Plus smartphone

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్ స్మార్ట్‌ ఫోన్‌ స్టాండర్డ్‌ వేరియంట్ కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. నథింగ్ సంస్థ మార్చిలో ఫోన్‌ 2a ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ ప్రస్తుత ప్రారంభ ధర రూ.23,999 గా ఉంది.

నథింగ్‌ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్‌ సంస్థ వెల్లడించింది.

ఈ ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్టాండర్డ్ మోడల్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లలో అందుబాటులో ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 2a Plus smartphone launch confirmed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X