50MP సెల్ఫీ కెమెరా కలిగిన నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. రూ.2000 డిస్కౌంట్..!
నథింగ్ సంస్థ నుంచి జులై 31న భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ హ్యాండ్‌సెట్ (Nothing Phone 2a Plus Smartphone Sale) విడుదల అయింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ సహా ఇతర రిటైల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ 2a కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల డిస్‌ప్లే సహా 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫోన్ 2a తరహా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను ధర రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2a ప్లస్ 6.7 అంగుళాల పుల్ HD+ (1080*2412 పిక్సల్ రిజల్యూషన్) అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 ppi పిక్సల్ డెన్సిటిని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ కలిగి ఉంది.
నథింగ్ స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 10x డిజిటల్ జూమ్ సామర్థ్యం, f/1.88 అపేచర్‌తో 50MP శాంసంగ్ GN9 1/1.57 అంగుళాల కెమెరా మరియు 114 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 50MP శాంసంగ్ JN1 1/2.76 అంగుళాల కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Mali G610 MC4 GPU మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Nothing OS 2.6 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుందని నథింగ్ సంస్థ వెల్లడించింది. 50W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీపైన పనిచేస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, Glonass, Galileo, QZSS, USB-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. యాంబియంట్ లైట్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలిరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Ip54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








