Home
Mobile

50MP + 50MP కెమెరాలు. 256GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ 5G ఫోన్‌ విడుదల.. ధర, సేల్‌ వివరాలు..!

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a Plus Smartphone Launched) భారత్‌లో విడుదల అయింది. స్టాండర్డ్‌ మోడల్‌ కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌తో అందుబాటులోకి వచ్చింది. వెనుకవైపు 50MP + 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ నథింగ్‌ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080*2412 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 394 ppi పిక్సల్ డెన్సిటి, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది.

Nothing phone 2a Plus Smartphone

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Nothing OS 2.6 ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యురిటీ అప్‌డేట్‌లు పొందనుందని నథింగ్‌ సంస్థ హామీ ఇచ్చింది. 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7350 ప్రో SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Mali G610 MC4 GPU మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. 50W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 40.6 గంటల ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చు.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్‌తో 50MP శాంసంగ్‌ GN9 1/1.57 అంగుళాల కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 10x డిజిటల్‌ జూమ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

114 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతో 50MP శాంసంగ్‌ JN1 1/2.76 అంగుళాల కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP శాంసంగ్‌ JN1 కెమెరాను అమర్చారు. నథింగ్ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉంది. గత మోడల్‌తో పోలిస్తే కెమెరా విభాగంలో మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, Glonass, Galileo, QZSS, USB-C ఛార్జింగ్ పోర్ట్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ఎలక్ట్రానిక్‌ కంపాస్‌, యాక్సిలిరోమీటర్‌, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది.

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ ను కలిగి ఉంది. కాల్స్‌, ఇతర నోటిఫికేషన్‌ల సమయంలో LED లైట్‌లు ఆకర్షణీయంగా వెలుగుతాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, లీనియర్‌ హ్యాప్టిక్‌ మోటార్‌ను కలిగి ఉంది. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లు, నాణ్యమైన మైక్రోఫోన్‌లను కూడా కలిగి ఉంటుంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌నుతో అందుబాటులోకి వచ్చింది.

నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ఆగస్టు 7 న ప్రారంభం కానుంది. నథింగ్‌ ఫోన్‌ 2a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. గ్రే, బ్లాక్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 2a Plus Smartphone with 50MP Selfie camera launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X