60 నిమిషాల్లో 60 వేల స్మార్ట్‌ఫోన్ల విక్రయం.. ఏంటి ఫోన్.. ఎందుకంత ప్రత్యేకత..!!
నథింగ్ ఫోన్ 2a సత్తా చాటింది. భారత్ మార్కెట్‌లోకి ఈ నెల 5వ తేదీన విడుదల అయింది. మార్చి 12వ తేదీ మధ్యా్హ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేల్‌పై సంస్థ కీలక ప్రకటన చేసింది. సేల్ ప్రారంభం అయిన తొలి 60 నిమిషాల్లో 60,000 స్మార్ట్ విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది.
వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనపై నథింగ్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది. అయితే నథింగ్ సంస్థ తొలిసారిగా బడ్జెట్ రేంజ్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత మోడళ్ల మాదిరిగానే ట్రాన్సపరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక కీలక ఫీచర్లతో విడుదల అయింది.

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing phone 2a Sale) భారత్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్ ధర రూ.25,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. బ్లాక్ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
నథింగ్ ఫోన్ 2aను HDFC బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కూడా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉండనుంది. 12 నెలల వరకు నోకాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
నథింగ్ ఫోన్ 2a స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing phone 2a Specs) 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది.

50MP+50MP కెమెరా : నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి : ఈ నథింగ్ ఫోన్ 2a 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసిన వారు ఫోన్ ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మరియు క్రోమా, విజయ్ సేల్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








