50MP + 50MP + 32MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.4000 తగ్గింపు..!
నథింగ్ ఫోన్‌లు ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే భిన్నమైన లుక్‌ను కలిగి ఉన్నాయి. బ్యాక్ ప్యానల్ పూర్తిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ / రిపబ్లిక్ డే సేల్‌లో (Flipkart Monumental Sale 2025) భాగంగా నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్‌ను (Nothing Phone 2a Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా సహా 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్ పూర్తి వివరాలు.
రూ.20000 కంటే తక్కువ ధరకే.. :
భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు.

అదనపు డిస్కౌంట్‌లు :
అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.21999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. దీంతోపాటు HDFC బ్యాంకు కార్డులతో గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. బ్లాక్, వైట్, బ్లూ కలర్ వేరియంట్స్ సహా ఒక స్పెషల్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని నథింగ్ వెల్లడించింది.
డిస్‌ప్లే వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ (2412*1084 పిక్సల్స్) అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ పొందుతుంది.
రెండు 50MP కెమెరాలు :
ఈ నథింగ్ ఫోన్ 2a హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కనెక్టివిటీ ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, Wi Fi 6, బ్లూటూత్ 5.3, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ కంపాస్, గైరో స్కో్‌ప్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సెలిరోమీటర్ సెన్సార్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చి ఉంది.


Click it and Unblock the Notifications








