Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 2a డిజైన్‌ టీజర్‌ విడుదల.. ఆకట్టుకొనే లుక్‌ సహా అదిరిపోయే ఫీచర్లు..!

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a) భారత్‌లో మార్చి 5వ తేదీన విడుదల కానుంది. అయితే సంస్థ ఇటీవల ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ధ్రువీకరించింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీ, కెమెరా, బ్యాటరీ, ధర, కలర్‌ ఆప్షన్‌ల వివరాలు మరియు డిజైన్‌ సమాచారం లీక్‌ అయింది. తాజాగా నథింగ్‌ ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ను విడుదల చేసింది.

నథింగ్‌ ఫోన్‌ 1 కంటే అప్‌‌డేటెడ్‌ ఫీచర్లు : ఈ నథింగ్‌ ఫోన్‌ 2a ఒకే కలర్‌ వేరియంట్‌లో కనిపించింది. మరియు నథింగ్‌ ఫోన్‌ 1 మరియు 2తో పోలిస్తే రీడిజైన్‌ చేయబడిన బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ నథింగ్‌ ఫోన్‌ 1 కంటే అప్‌‌డేట్‌ చేయబడిన ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు నథింగ్‌ ఫోన్‌ 2 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

 Nothing phone 2a Smartphone design teased  news

నథింగ్‌ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను X వేదికగా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ వైట్ కలర్‌లో కనిపించింది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ మాదిరిగా ఈ కొత్త ఫోన్‌ కూడా ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరాలు సమాంతరంగా అమర్చబడి ఉన్నాయి. నథింగ్‌ ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో రానుంది.

భారత్‌లోనే తయారీ : నథింగ్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 12GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. మరియు అదనంగా 8GB ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకొనే అవకాశం ఉంది. దీంతోపాటు భారత్‌లో విక్రయించే నథింగ్‌ ఫోన్ 2a ఫోన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారుచేస్తామన్నారు.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుందని సమాచారం. వెనుకవైపు రెండు 50MP కెమెరాలు మరియు 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. మరియు 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్‌ ఆధారిత నథింగ్‌OS 2.5 వెర్షన్‌పైన పనిచేయనుంది.

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a మార్చి 5వ తేదీన భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ గురించి అనేక స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ సహా మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ ధర రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది. మరియు బ్లా్క్, వైట్‌ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nothing phone 2a Smartphone design teased ahead of launch on march 5 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X