50MP+50MP కెమెరాలు, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు.. పూర్తి వివరాలు..!
దీపావళీ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a Smartphone) భారీ డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం ఫోన్‌లు సహా అన్ని ధరల సెగ్మెంట్ హ్యాండ్‌సెట్‌లపై సంస్థలు సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు డిస్కౌంట్‌లు అందించాయి. ప్రస్తుతం నథింగ్ ఫోన్ 2a ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఈ సంవత్సరం మార్చి నెలలో భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. యూనిక్ డిజైన్ సహా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్ లభిస్తుంది.

విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ వేరియంట్‌ను రూ.22,190 కు కొనుగోలు చేయవచ్చు. అయితే కలర్ వేరియంట్‌ను బట్టి ధరల్లో కొన్ని మార్పులున్నాయి. మిగిలిన రెండు వేరియంట్‌లు కూడా తగ్గింపు ధరను పొందాయి.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌లు స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు :
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1080*2412 పిక్సల్స్ రిజల్యూషన్, ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 394 PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.6 పైన పనిచేస్తుంది మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ నథింగ్ స్మార్ట్‌ఫోన్ మూడు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ వెల్లడించింది.
కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్ 2a వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను అమర్చారు. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ నథింగ్ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications