Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. 50MP + 50MP కెమెరాలు, 8GB ర్యామ్‌ 5G ఫోన్‌ పై రూ.2000 తగ్గింపు!

సాధారణ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ కంటే విభిన్నంగా పారదర్శక ప్యానల్‌ తో నథింగ్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ లో ప్రవేశించి, ప్రముఖ బ్రాండ్‌ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ నథింగ్‌ ఫోన్‌లు, గ్యాడ్జెట్‌లు డిజైన్, పనితీరుతో అనేక మంది యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ 2024 లో (Flipkart Big Saving Days Sale 2024) భాగంగా నథింగ్‌ ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ ఈనెల 20వ తేదీన ప్రారంభం కాగా.. డిసెంబర్‌ 25 వరకు సేల్‌ కొనసాగుతుంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a Smartphone) భారత్‌ మార్కెట్‌ లో రూ.23,999 ప్రారంభ ధరకు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ ను ప్రారంభ ధర రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Nothing Phone 2a Smartphone sale

నథింగ్‌ ఫోన్ 2a ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌, బ్లూ, వైట్‌ రంగులో అందుబాటులో ఉంది. అయితే నథింగ్‌ ఫోన్‌ 2a ప్రత్యేక ఎడిషన్‌ హ్యాండ్‌సెట్‌ కూడా అందుబాటులో ఉంది.

నథింగ్ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు :
ఈ నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ (2412*1084 పిక్సల్స్‌) అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది.

Nothing Phone 2a Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.6 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌ లు, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను అమర్చారు. ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంది.

నథింగ్ ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3, WiFi 6, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చి ఉంది. యాంబియంటై లైట్‌ సెన్సార్‌, యాక్సెలిరోమీటర్‌, ఎలక్ట్రానిక్‌ కంపాస్‌, గైరో స్కో్‌ప్‌, యాక్సెలిరోమీటర్‌ సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a Smartphone gets RS2000 price discount on flipkart Big saving days sale 2024 december
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X