నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ మరో కలర్ వేరియంట్.. ఈ మూడు రంగుల కంటే భిన్నంగా..!!
నథింగ్ సంస్థ నుంచి ఇటీవల నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2a New Colour Variant) విడుదల అయింది. తొలుత తెలుపు, నలుపు రంగుల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అనంతరం సంస్థ ఈ హ్యాండ్‌సెట్‌ను బ్లూ రంగులో కూడా లాంచ్ చేసింది. అయితే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా మరో కలర్ వేరియంట్ త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ ఈ కొత్త వేరియంట్‌ను 'Powerfully unique' కలర్ గా పేర్కొంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో Nothing R... నలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండడాన్ని గమనించవచ్చు. దీని ద్వారా ఈ కొత్త కలర్ వేరియంట్ మల్టీ కలర్ వేరియంట్ గా తెలుస్తోంది. అయితే ఈ కలర్ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

తొలుత పోస్టర్‌ను షేర్ చేసిన ఫ్లిప్‌కార్ట్.. అనంతరం దాన్ని తీసివేసినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణాలు తెలియలేదు. అయితే ఈ నథింగ్ ఫోన్ 2a మల్టీ కలర్ వేరియంట్ విడుదల తేదీని కచ్చితంగా వెల్లడించలేదు. మరియు జులైలో లాంచ్ అయ్యే కమ్యూనిటీ ఎడిషన్‌కు ఇది భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB ర్యామ్‌తో జతచేయబడింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 2a మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మరియు నలుపు, తెలుపు, బ్లూ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








