Home
Mobile

50MP+50MP కెమెరాల నథింగ్‌ ఫోన్‌ 2a సేల్‌ ప్రారంభం అయింది.. సేల్‌ వివరాలు..!!

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a Sale) భారత్‌ మార్కెట్‌లో మార్చి 5న లాంచ్‌ అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ ఆఫర్‌ "Only Day 1 offer' తో అత్యంత తక్కువధరకే ఈఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజీ ఆఫర్ ద్వారా ఈ నథింగ్‌ ఫోన్‌ 2a ను రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్‌ ధర రూ.25,999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.27,999 గా ఉంది. బ్లాక్‌ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone 2a smartphone sale is now live on Flipkar

ఈ నథింగ్‌ ఫోన్ 2aను HDFC బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల ద్వారా కూడా ఇటువంటి ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్ ధర రూ.19999 గా ఉండనుంది. 12 నెలల వరకు నోకాస్ట్‌ EMI సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెసిఫికేషన్లు :
నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

మరియు గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్‌ సంస్థ వెల్లడించింది.

నథింగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ కొనుగోలు చేసిన వారు ఫోన్‌ ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ మరియు క్రోమాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a smartphone sale is now live on Flipkart here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X