50MP + 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పై రూ.5000 వరకు తగ్గింపు..!
నథింగ్ సంస్థ గత సంవత్సరం భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మార్చిలో నథింగ్ 3a సిరీస్‌ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో (Amazon Great Summer Sale 2025) భాగంగా నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్‌లతోపాటు బ్యాంకు ఆఫర్‌ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.
నథింగ్ ఫోన్ ధర, ఆఫర్ల వివరాలు :
భారత్ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్ (Nothing Phone 2a Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.18,785 కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.5 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్‌ను అందిస్తోంది. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

మూడు కలర్ వేరియంట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,084 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,490 గా ఉంది. అయితే కలర్ వేరియంట్‌ను బట్టి ఈ ధరల్లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది.
డిస్‌ప్లే వివరాలు :
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2412x1084 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ నథింగ్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. మరియు ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 నథింగ్ OS 2.6 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2a మోడల్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని నథింగ్ తెలిపింది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ నథింగ్ హ్యాండ్‌సెట్ డ్యూయల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు చేస్తుంది.
5000mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 6, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








