నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విడుదల... తొలిసారి మల్టీ కలర్ వేరియంట్‌గా...!!
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్ (Nothing Phone 2a Special Edition) తాజాగా భారత్ సహా అనేక దేశాల్లో విడుదల అయింది. ఇప్పటికే తెలుపు, నలుపు, నీలం రంగుల్లో ఉండగా.. తాజాగా ఎరువు, యెల్లో, నీలం రంగుల్లో మల్టీ కలర్ వేరియంట్‌గా లాంచ్ అయింది. తొలిసారిగా నథింగ్ స్మార్ట్ ఫోన్ అనేక రంగుల కలయికలో లాంచ్ అయింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే విధంగా ఉంది. తొలిసారిగా మల్టీ కలర్ డిజైన్‌ను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్పెసిఫికేషన్‌లు :
నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ స్టాండర్డ్ వేరియంట్ తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండనుంది. 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ స్పెషల్ ఎడిషన్ కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS 2.5 పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని నథింగ్ హామీ ఇచ్చింది.
50MP డ్యూయల్ కెమెరాలు :
నథింగ్ తాజా స్పెషల్ ఎడిషన్ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో.. :
నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం సింగిల్ వేరియంట్‌లోనే అందుబాటులోనే ఉంటుందని తెలుస్తోంది. జూన్ 5 నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ ధర, సేల్ :
నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 5వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








