Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌.. ఈ బ్యాంకు కార్డులపై ధర తగ్గింపు..!

నథింగ్‌ నుంచి ఇటీవల ఫోన్‌ 2a స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల అయింది. తొలిసారిగా నథింగ్ సంస్థ మల్టీ కలర్‌ వేరియంట్‌ ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం తెలుపు, నలుపు, నీలం రంగుల్లో నథింగ్‌ ఫోన్‌ 2a అందుబాటులో ఉండగా.. మే 29న ఎరుపు, పసుపు, నీలం రంగులతో మరో కలర్‌ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌ సెట్‌ను ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కొనుగోలు (Nothing Phone 2a special edition sale) అందుబాటులో ఉంటుంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ ఫోన్‌ స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌ సెట్ ధర రూ.27,999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం తగ్గింపు, యాక్సెస్ డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

Nothing Phone 2a special edition sale to start from june 5 5PM

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెషల్‌ ఎడిషన్‌ స్పెసిఫికేషన్‌ లు :
నథింగ్‌ ఫోన్‌ 2a స్పెషల్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ ఫోన్‌.. స్టాండర్డ్‌ వేరియంట్‌ స్పెసిఫికేషన్‌ లతో అందుబాటులోకి వచ్చింది. 6.7 అంగుళాల పుల్‌ HD + అమోలెడ్‌ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌ నెస్‌ ను కలిగి ఉంది.

నథింగ్‌ స్పెషల్‌ ఎడిషన్‌ హ్యాండ్‌ సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 ను కలిగి ఉంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌ తో జతచేయబడుతుంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌ డేట్‌లు ఇస్తామని నథింగ్‌ హామీ ఇచ్చింది.

నథింగ్‌ ఫోన్ 2a మల్టీ కలర్‌ వేరియంట్‌ స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటి కప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a special edition smartphone sale to start from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X