Home
Mobile

ధర రూ. 23,999 కే లాంచ్ అయిన Nothing Phone 2a! అదనంగా బ్యాంకు ఆఫర్ కూడా

నథింగ్ సంస్థ ఎట్టకేలకు తన మూడవ స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు లాంచ్ చేసింది. సంస్థ నుంచి లాంచ్ అయిన Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్ రెండు 8GB మరియు 12GB RAM వేరియంట్‌లలో వస్తుంది. నథింగ్ సంస్థ భారతదేశంలో గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి.

నథింగ్ ఫోన్ 2a దాని ముందు తరం ఫోన్ల మాదిరిగా పారదర్శక డిజైన్‌తో నలుపు మరియు తెలుపు రంగు ఎంపికలో వస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత నథింగ్ OS 2.5 తో పనిచేస్తుంది. మరియు ప్రత్యేకమైన నథింగ్ ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.

Nothing Phone 2a price

భారతదేశంలో Nothing Phone 2a ధర వివరాలు
నథింగ్ ఫోన్ 2a భారతదేశంలో మూడు RAM మరియు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది.
8GB RAM మరియు 128 GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ. 23,999 కి అందుబాటులో ఉంటుంది. మరియు 8GB RAM మరియు 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.25,999 గా ఉంది. అలాగే, 12GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది.

ఆఫర్ల వివరాలు గమనిస్తే, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ పై రూ.2,000 ఆఫర్‌లను కూడా ప్రకటించింది. అంటే, అర్హత గల కస్టమర్‌ల కోసం బ్యాంకు ఆఫర్ ద్వారా , ఫోన్ ధర రూ.2,000 తగ్గుతుంది. ఆఫర్ తర్వాత బేసిక్ మోడల్‌ రూ. 21,999 నుండి ప్రారంభమవుతుంది మరియు టాప్ వేరియంట్ ధర రూ.25,999 కు కొనుగోలు చేయవచ్చు.

Nothing Phone 2a స్పెసిఫికేషన్ల వివరాలు
నథింగ్ ఫోన్ 2a లో 6.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లే 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు గరిష్ట ప్రకాశం 1300 నిట్‌ల వరకు ఉంటుంది. ఈ ఫోన్ దాని స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో సన్నని బెజెల్‌లను కలిగి ఉంది. ఇవి స్క్రీన్‌కు నాలుగు వైపులా కేవలం 2.1 మిమీ గా ఉంటాయి.

నథింగ్ ఫోన్ 2a గరిష్టంగా 12GB RAM తో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. అదనంగా, ఈ ఫోన్‌లో 8GB RAM బూస్టర్ ఉంది, ఇది మొత్తం RAMని 20GBకి పెంచుతుంది. ఇది మూడు ర్యామ్ మరియు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. రెండు మోడల్‌లు 8GB ర్యామ్ తో వస్తాయి, 128GB మరియు 256GB స్టోరేజీ ఎంపికలు ఉన్నాయి. ఇక టాప్ వేరియంట్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం కెమెరా వివరాలు గమనిస్తే, నథింగ్ ఫోన్ 2a వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.88 ఎపర్చరు లెన్స్ మరియు 1/1.56-అంగుళాల సెన్సార్ పరిమాణం మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు మద్దతుతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. మరొకటి 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది.

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఫోన్ బాక్స్‌లో చార్జర్ అందుబాటులో ఉండదు. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a With Mediatek Dimensity 7200 Processor, Glyph Interface Launched In India. Price,Offers And Sale Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X