ఇవాళే నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్ 1 విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు, లైవ్ ఈవెంట్ వివరాలు..!
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్స్ 1 ఇవాళ విడుదల కానున్నాయి. లండన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30PM IST గంటలకు లైవ్ ప్రారంభం కానుంది. నథింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షించవచ్చు. నథింగ్ ఫోన్ 3 గురించి ఆ సంస్థ సీఈవో కార్ల్ పై ఫస్ట్ ట్రూ ఫ్లాగ్‌షిప్ మోడల్ గా చెప్పారు.
గ్లిఫ్ మ్యాట్రిక్స్ :
నథింగ్ ఫోన్ 2 విడుదల అయిన సుమారు రెండు సంవత్సరాల తర్వాత నథింగ్ ఫోన్ 3 విడుదల అవుతోంది. డిజైన్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరంగా అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నథింగ్ ఫోన్‌లు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవాళ విడుదల కానున్న నథింగ్ ఫోన్ 3 మోడల్ మాత్రం గ్లిఫ్ మ్యాట్రిక్స్ తో లాంచ్ కానుంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు అనేక మెరుగైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. గత మోడల్స్ సాఫ్ట్‌వేర్, డిజైన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టిన నథింగ్ తాజా మోడల్‌లో పనితీరుపైనా ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 3 కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. ఇందులో 50MP పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఫలితంగా గత మోడల్స్‌తో పోలిస్తే కెమెరా విభాగం పరంగా మెరుగైన పనితీరు అందించే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 16 తో :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ కానుంది. దీంతోపాటు 5 సంవత్సరాల OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుంది. మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లపైనా ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ 6.7 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది. బ్యాటరీ పరంగా 65W వైర్, వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 5150mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 3 తోపాటు నథింగ్ హెడ్‌ఫోన్ 1 (Nothing Headphone 1) కూడా విడుదల కానుంది. ఈ హెడ్‌ఫోన్ కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇటీవల టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ లీక్ చేసిన వివరాల ఆధారంగా ఈ హెడ్‌ఫోన్స్ 40mm PU, నికిల్ కోటింగ్‌ను కలిగి ఉంటుంది. KEF ట్యూనింగ్ తో లాంచ్ కానుంది.
ఈ హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 80 గంటల (ANC Off, AAC Codec) బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అదే ANC ఆన్ చేసి ఉపయోగిస్తుంటే.. బ్యాటరీ లైఫ్ 35 గంటలకుగా ఉంటుంది. ANC ఆఫ్ చేసి LDAC మోడ్‌లో వినియోగిస్తుంటే 54 గంటలు, అదే ANC ఆన్‌లో ఉంటే 30 గంటలుగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది.


Click it and Unblock the Notifications








