Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 3 డిజైన్‌, ధర వివరాలు లీక్‌.. ఎప్పుడు విడుదల కానుందంటే..?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌ నుంచి జులై 1 వ తేదీన నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 3) లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఫోన్‌ నథింగ్‌ తొలి ఫ్లాగ్‌షిప్‌ డివైజ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2 తో పోలిస్తే ధర అధికంగా ఉండనుంది.

గత నెలలోనే డిజైన్‌లో మార్పులపై టీజర్‌ ద్వారా నథింగ్‌ సంస్థ కొన్ని వివరాలను అందించింది. నథింగ్‌ ఫోన్‌లో ప్రముఖంగా కనిపించే గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ లేకుండానే నథింగ్‌ ఫోన్‌ 3 లాంచ్‌ కానుందని తెలిపింది. అయితే తాజాగా ఈ ఫోన్‌ డిజైన్‌ సహా ధర వివరాలు లీక్‌ అయ్యాయి.

Nothing phone 3 price and design leaked

టిప్‌స్టర్‌ మ్యాక్స్‌ జాంబర్‌ (@maxjmb) నథింగ్ ఫోన్‌ 3 బ్యాక్‌ ప్యానల్ డిజైన్‌ షేర్‌ చేశారు. గతంలో చెప్పినట్లుగానే గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ లేకుండా ఉంది. అయితే సెమీ ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌ను మాత్రం కలిగి ఉంది. ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌తో నథింగ్ ఫోన్‌లు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తుంపు పొందాయి.

ట్రిపుల్‌ కెమెరాలు :
ఈ డిజైన్‌ ఆధారంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలిసింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా కీ :
లీక్‌ అయిన ఇమేజ్‌ ఆధారంగా ఈ ఫోన్‌ ఎడమ వైపు వాల్యూమ్‌ బటన్‌ను కలిగి ఉంది. అదే కుడి వైపున పవర్ బటన్‌ తోపాటు మరో కీ ని గుర్తించవచ్చు. నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌లో ఉన్న Essential Key గా ఉంటుందని తెలుస్తోంది.

శక్తివంతమైన చిప్‌సెట్‌! :
నథింగ్ ఫోన్‌ 3 ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీని ఆధారంగా ఈ ఫోన్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ వేర్వేరు మార్కెట్‌లో ధర వివరాలు వెల్లడి కాగా.. తాజాగా అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్‌ ధర వివరాలు వెల్లడయ్యాయి.

Take a Poll

అమెరికా మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్ 3 హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర $799 గా (భారత కరెన్సీ ప్రకారం రూ.68,320) గా ఉంటుందని టిప్‌స్టర్‌ Leaker @MysteryLupin తెలిపారు. అయితే గతంలో వచ్చిన వివరాల ఆధారంగా యూరప్‌ మార్కెట్‌లో ఈ ఫోన్ ధర సుమారు రూ.90 వేలుగా ఉంటుంది.

అయితే భారత్‌ మార్కెట్‌లో మరింత తక్కువ ధరకే నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. సుమారు రూ.60 వేల ధర రేంజ్‌లో విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 3 జులై 1 వ తేదీ 10:30 PM IST గంటలకు భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. దీంతోపాటు నథింగ్‌ తొలి హెడ్‌ఫోన్‌ నథింగ్‌ హెడ్‌ఫోన్‌ 1 కూడా అదే రోజు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

Best Mobiles in India

English summary
Nothing phone 3 price and design leaked ahead of launch on july 1 globally
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X