Home
Mobile

ఇవాళ్టి నుంచే నథింగ్ ఫోన్ 3 సేల్‌.. ఫ్లాగ్‌షిప్‌ కెమెరాలు, గ్లిఫ్‌ మ్యాట్రిక్స్ డిజైన్ సహా ఎన్నో ప్రత్యేకతలు.!

Nothing Phone 3 : నథింగ్‌ సంస్థ నుంచి జులై 1 న నథింగ్‌ ఫోన్‌ 3 హ్యాండ్‌సెట్ విడుదల అయింది. నథింగ్‌ తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా అందుబాటులోకి వచ్చింది. గత మోడల్స్‌తో పోలిస్తే సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ పరంగా అనేక మార్పులతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. దీంతోపాటు గత మోడల్స్‌తో పోలిస్తే ధర చాలా ఎక్కువగా ఉంది. నథింగ్‌ ఫోన్ 3 సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నథింగ్‌ హెడ్‌ఫోన్ 1 కూడా ఇవాళ్టి నుంచే కొనుగోలు చేయవచ్చు.

ధర, సేల్‌ వివరాలు :
నథింగ్‌ ఫోన్‌ 3 హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌, విజయ్ సేల్స్‌, క్రోమా, రిటైల్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79999 గా ఉంది. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89999 గా ఉంది.

Nothing Phone 3 sale to start from today in india

డిస్కౌంట్ ఆఫర్‌ :
అయితే బ్యాంకు డిస్కౌంట్‌లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో 12GB ర్యామ్‌ను 62999 కే కొనుగోలు చేయవచ్చని నథింగ్‌ చెబుతోంది. అదే 16GB ర్యామ్‌ వేరియంట్‌ను రూ.72999 కే సొంతం చేసుకోవచ్చని చెబుతోంది. ఈ ఫోన్‌ కొనుగోలుపై సంవత్సరం అదనపు వారంటీని అందిస్తున్నట్లు నథింగ్‌ తెలిపింది.

నథింగ్‌ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ గ్లిఫ్‌ మ్యాట్రిక్స్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో గ్లిఫ్‌ మిర్రర్‌, డిజిటల్‌ క్లాక్‌, స్టాప్‌ వాచ్‌, బ్యాటరీ ఇండికేటర్‌, సోలార్‌ క్లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరియు బోల్డ్‌ బయోమెట్రీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్ట్రా థిన్‌ మరియు యూనిఫామ్‌ బెజెల్స్‌ను కలిగి ఉంది.

Nothing Phone 3 sale to start from today in india

నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
నథింగ్‌ ఫోన్‌ 3 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 92.89 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Essential search, Essential Space, ఫ్లిప్‌ టూ రికార్డు వంటి ఫీచర్లున్నాయి.

ప్రాసెసర్ :
నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తుంది. అయితే 2025 మూడో త్రైమాసికంలో ఆండ్రాయిడ్‌ 16 అప్‌డేట్‌ పొందుతుందని నథింగ్ చెబుతోంది.

7 సంవత్సరాల వరకు :
ఈ ఫోన్ ఏకంగా 5 సంవత్సరాల అండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని తెలిపింది. ఈ ఫోన్ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్, 15W వైర్‌లైస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh సిలికాన్‌ కార్బన్ బ్యాటరీతో పనిచేస్తుంది. 54 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్ చేయవచ్చని నథింగ్ చెబుతోంది.

50MP + 50MP + 50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా (OIS), 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను ఉన్నాయి. అయితే ఈ ఫోన్‌ ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3 sale to start from today in india here are the bank and exchange offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X