నథింగ్ ఫోన్ 3 ప్రాసెసర్ వివరాలు వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల అంచనా వివరాలు..!
Nothing Phone 3 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ నథింగ్ నుంచి జులై 1 వ తేదీన నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్ 1 విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. నథింగ్ ఫోన్ 3 సంస్థ తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్ గా రానుందని తెలుస్తోంది. ప్రీమియం మెటీరియల్స్ తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 ధర కంటే అధిక ధరకు విడుదల కానుంది.
గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లేకుండానే :
నథింగ్ ఫోన్ 3 మోడల్ ను మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా చెన్నై ప్లాంట్ లో తయారీ చేస్తామని చెప్పారు. నథింగ్ ఫోన్‌లు అంటే వెంటే డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ గుర్తొస్తాయి. అయితే నథింగ్ ఫోన్ 3 గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లేకుండానే విడుదల చేస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన టీజర్ ద్వారా నథింగ్ వెల్లడించింది.

ఎప్పుడు విడుదల కానుంది? :
నథింగ్ ఫోన్ 3 చిప్‌సెట్ వివరాలు ఆ సంస్థ సీఈవో కార్ల్ పై వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనేక వివరాలను వెల్లడించారు. గత మోడల్స్ లో ఎక్కువగా డిజైన్, సాఫ్ట్‌వేర్ పైన ఎక్కువ ఫోకస్ చేసిన నంథింగ్.. జులై 1 న విడుదల నథింగ్ ఫోన్ 3 మాత్రం పనితీరుపై ముఖ్యంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిప్‌సెట్ తో పనిచేస్తుంది :
ఇందులో భాగంగా ఈ నథింగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ప్రాసెసర్‌లలో ఇదే అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్‌గా ఉంటుంది. AI ఆధారిత ఫీచర్‌ల కోసం క్వాల్‌కాంతో తమ ఇంజినీరింగ్ బృందం కలిసిపనిచేసినట్లు కార్ల్ పై చెప్పారు.
నథింగ్ ఫోన్ 2 తో పోలిస్తే 36 శాతం CPU, 88 శాతం GPU, 60 శాతం NPU పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్ లో సుమారు రూ.65 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అంచనా వివరాలు :
నథింగ్ ఫోన్ 3 హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్, నథింగ్ హెడ్‌ఫోన్ 1.. లండన్‌లో జరిగే గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం 10:30 PM గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. విడుదల అనంతరం నథింగ్ ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications