నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు లీక్.. వచ్చే వారంలో విడుదల..!
Nothing Phone 3 Smartphone : నథింగ్ సంస్థ జులై 1 వ తేదీన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. ఇందులో నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్స్ 1 లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం జులై 1 రాత్రి 10:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫోన్ 3 కి సంబంధించిన అనేక వివరాలను ఇప్పటికే వెల్లడయ్యాయి. నథింగ్ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వివరాలను వెల్లడిస్తోంది.
గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్ :
తాజాగా నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 3 చిప్‌సెట్, డిజైన్ వివరాలను టీజర్ ల ద్వారా సంస్థ వెల్లడించింది. దీని ఆధారంగా త్వరలో విడుదల కానున్న నథింగ్ ఫోన్ గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్ తో విడుదల కానుంది. గత మోడల్స్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉన్నాయి.

చిప్‌సెట్ వివరాలు :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. గత మోడల్స్ లో సాఫ్ట్‌వేర్, డిజైన్ కు ప్రాధాన్యత ఇచ్చిన నథింగ్.. త్వరలో లాంచ్ కానున్న మోడల్‌లో పనితీరుపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
డిస్‌ప్లే, బ్యాటరీ వివరాలు :
గ్యాడ్జెట్ బిట్స్ వివరాల ఆధారంగా నథింగ్ ఫోన్ 3 మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5150mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
🚨 Exclusive
— Gadget Bits (@gadget_bits) June 21, 2025
Nothing Phone (3)
- 6.7" 1.5k OLED LTPO display
- 50mp + 50mp 3x periscope + 50mp UW
- 50mp front
- 5150mAh battery (typ) + 100W charging
- Wireless + reverse wireless charging
- NFC, eSIM
- Nothing OS 3.5 on Android 15
- Snapdragon 8s Gen 4
Launching on July 1st pic.twitter.com/GB3TaeekT6
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాల కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.5 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని ఇటీవల నథింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ NFC తోపాటు eSIM సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
భారత్ మార్కెట్ లో నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.50,000 నుంచి రూ.60,000 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ తోపాటు నథింగ్ తొలి హెడ్‌ఫోన్స్ కూడా విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications