నథింగ్ ఫోన్ 3 విడుదల తేదీ వచ్చేసింది.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల అంచనా వివరాలు..!
Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 గురించి ఇటీవలే చర్చ జరుగుతోంది. ఈ ఫోన్ ప్రీమియం మెటీరియల్స్‌తో అందుబాటులోకి వస్తుందని, గత మోడల్స్‌తో పోలిస్తే భారీ ధరకు లాంచ్ కానుందని ఇప్పటికే చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ నథింగ్ సంస్థ నుంచి వస్తున్న తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్ గా ఉంటుందని కూడా తెలుస్తోంది. దీంతోపాటు సాఫ్ట్‌వేర్ పరంగా డిజైన్ పరంగానూ అనేక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలుస్తోంది.
గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లేకుండానే..! :
ఇటీవలే నథింగ్ సీఈవో కార్ల్ పై ధరపై క్లారిటీ ఇచ్చారు. దీంతోపాటు ఇటీవల నథింగ్ టీజర్ ఆధారంగా నథింగ్ ఫోన్‌లో ప్రముఖంగా కనిపించిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. నథింగ్ ఫోన్ అంటే ప్రముఖంగా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తోపాటు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ గుర్తొచ్చేవి.

ఎప్పుడు విడుదల కానుంది :
అయితే ఈ ఫోన్ జులై లో లాంచ్ కానుందని ఇప్పటికే తెలిసింది. తాజాగా లాంచ్ తేదీ కూడా వెల్లడైంది. నథింగ్ సంస్థ అందించిన వివరాల ఆధారంగా నథింగ్ ఫోన్ 3 గ్లోబల్ లాంచ్ జులై 1 BST PM BST కు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం జులై 1 రాత్రి 10:30 PM గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది.
ఎంత ధరలో అందుబాటులోకి రానుంది..? :
నథింగ్ ఫోన్ 3 విడుదల కార్యక్రమాన్ని సంస్థ అధికారిక యూట్యూ్బ్ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. విడుదల అనంతరం ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. ఈ ఫోన్ కలర్ వేరియంట్స్ కు సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 3 ప్రారంభ ధర రూ.60,000 గా ఉండే అవకాశం ఉంది.
నథింగ్ ఫోన్ 3 అంచనా వివరాలు :
ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా లాంచ్ కానుంది తెలుస్తోంది. అందువల్ల స్నాప్‌డ్రాగన్ 8 Elite లేదా స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB ర్యామ్ మరియు UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది.
డిస్‌ప్లే :
దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగానూ బెస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 120Hz రీప్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
ట్రిపుల్ కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్ 3 ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రైమరీ, అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లతోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు 50W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ జులై 1 న విడుదల కానుంది. అప్పటి లోగా మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. నథింగ్ ఫోన్ 3 సంస్థ తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అయితే ఎలాంటి అప్‌గ్రేడ్స్, ఫీచర్‌లను కలిగి ఉంటుందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications