Home
Mobile

నథింగ్‌ ఫోన్ 3 ధర అంచనా వివరాలు లీక్‌.. గత మోడల్ కంటే మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో... !!

నథింగ్‌ సంస్థ ఇటీవల నథింగ్‌ ఫోన్‌ 2a ను విడుదల చేసింది. తాజాగా మరో కొత్త హ్యాండ్‌సెట్‌ నథింగ్‌ ఫోన్‌ 3 (Nothing Phone 3 Smartphone) ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది. అయితే ఈ కొత్తఫోన్‌ నథింగ్‌ ఫోన్‌ 2 కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపైన చర్చ జరుగుతోంది.

నథింగ్‌ ఫోన్ 3 విడుదల తేదీపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకున్నా.. ఈ జులై నెలలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ నథింగ్‌ ఫోన్‌ 2 కంటే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్‌ 8s జెన్‌ 3 SoC చిప్‌ సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు గత మోడల్‌తో పోలిస్తే భారీ డిస్‌ప్లే, బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

Nothing Phone 3 smartphone price range leaked

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్‌ 2 హ్యాండ్‌ సెట్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC ప్రాసెసర్‌పైన పనిచేస్తోంది. మరియు 6.7 అంగుళాల HD + LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు డ్యూయల్‌ 50MP కెమెరాలు సహా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

కొన్ని నివేదికల ప్రకారం ఈ నథింగ్‌ ఫోన్‌ 3 ధర రూ.40 వేల నుంచి రూ.45 వేల మధ్యన ఉండే అవకాశం ఉంది. నథింగ్‌ ఫోన్‌ 2 కూడా ఇదే రేంజ్‌ ధరకు విడుదల అయింది. ఈ ఫోన్ 2 హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్‌ ధర రూ.44,999 గా ఉంది. అయితే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a ఇటీవలే విడుదల అయింది. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ను రూ.23999కు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS పైన పనిచేస్తోంది.

నథింగ్‌ ఫోన్ 2a వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బ్లాక్‌ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Nothing Phone 3 smartphone price range leaked ahead of launch expected in july 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X