Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 3 గురించి షాకింగ్‌ న్యూస్‌.. అంత ప్రత్యేకత ఈ ఫోన్‌లో ఏముంటుంది..?

నథింగ్‌... ఈ పేరు వింటేనే స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ వెంటనే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే డిజైన్‌ అంత ప్రత్యేకంగా ఉంటుంది. భారత్‌లో నథింగ్‌ సంస్థ స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు నథింగ్ ఫోన్‌ 1, నథింగ్‌ ఫోన్‌ 2, నథింగ్‌ ఫోన్ 2a, 2a ప్లస్‌ తోపాటు నథింగ్‌ ఫోన్‌ 3a, 3a ప్రో వేరియంట్స్‌ అందుబాటులోకి వచ్చాయి. త్వరలో భారత్‌లో నథింగ్‌ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 3) విడుదల కానుంది.

నిజంగా షాకింగే! :
ఎప్పటి నుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ షాకింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. నథింగ్‌ ఫోన్‌ 3 కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వార్త నిజంగానే షాకింగే.. ఎందుకంటే ధర ఆ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది.

Nothing Phone 3 smartphone price

నథింగ్‌ సంస్థ సీఈవో Carl Pei తాజాగా నథింగ్‌ ఫోన్‌ 3 గురించి ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఫోన్‌ నథింగ్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ ఫోన్ ధర సుమారుగా EUR 800 గా ఉంటుందని చెప్పారు. అంటే భారత్‌ కరెన్సీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌ ధర సుమారుగా రూ.90,500 గా ఉంటుంది.

ఏకంగా డబుల్‌ ధర :
నథింగ్‌ ఫోన్ 2 భారత్‌ మార్కెట్‌లో రూ.44,999 కి విడుదల అయింది. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఏకంగా డబుల్‌ ధరకు నథింగ్ ఫోన్‌ 3 విడుదల కానుందని తెలుస్తోంది. అయితే నథింగ్ ఫోన్‌ ప్రీమియం మెటీరియల్స్‌ తోపాటు మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

శక్తివంతమైన చిప్‌సెట్ :
నథింగ్ ఫోన్‌ 3 హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 లేదా డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మెరుగైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లతో కూడిన నథింగ్‌ OS 3.0 ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దీంతోపాటు త్వరలో విడుదల కానుందని భావిస్తున్న నథింగ్ ఫోన్‌ టైటానియం ఫ్రేమ్ లేదా రీన్‌పోర్స్డ్‌ గ్లాస్‌ మరియు సిరామిక్‌ మెటీరియల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు కస్టమైజ్‌ యాక్షన్ బటన్‌తోపాటు బెస్ట్ కెమెరాలను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నథింగ్‌ ఫోన్‌ 3 ఎప్పుడు లాంచ్‌ కానుంది ? :
నథింగ్‌ ఫోన్ 1 మోడల్‌ 2022 జులై లో విడుదల అయింది. అదే నథింగ్‌ ఫోన్ 2 మోడల్‌ 2023 జులైలోనే అందుబాటులోకి వచ్చింది. నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్‌ మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

నథింగ్‌ ఫోన్ 3a ఫోన్‌ :
నథింగ్‌ ఫోన్ 3a మోడల్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Nothing OS 3.1 పైన పనిచేస్తోంది. 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

నథింగ్‌ ఫోన్ 3a ప్రో :
నథింగ్‌ ఫోన్‌ 3a ప్రో హ్యాండ్‌సెట్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 పైన పనిచేస్తోంది. 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3 smartphone price range teased by CEO carl pei here are the expected details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X