Home
Mobile

Nothing Phone 3 : నథింగ్‌ నుంచి మరో టీజర్‌.. గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా గ్లిఫ్‌ మ్యాట్రిక్స్..!!

Nothing Phone 3 : నథింగ్‌ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ జులై 1 వ తేదీన విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ నథింగ్ తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ హ్యాండ్‌సెట్‌ ప్రీమియం మెటీరియల్స్‌ ను కలిగి ఉంటుందని లీక్స్‌ వచ్చాయి. దీంతోపాటు నథింగ్ కూడా టీజర్‌ ద్వారా ఈ ఫోన్ గురించి అనేక వివరాలను వెల్లడిస్తోంది.

గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ గుర్తొస్తాయి! :
నథింగ్‌ ఫోన్‌లు అంటే వెంటనే గుర్తొచ్చేవి.. గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, ట్రాన్స్‌పరెంట్ డిజైన్. అయితే నథింగ్‌ ఫోన్‌ 3లో గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ ఉండదని ఇప్పటికే నథింగ్‌ స్పష్టం చేసింది. అయితే అందుకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే తాజాగా నథింగ్‌ నుంచి తాజాగా మరో కీలక ప్రకటన వచ్చింది.

Nothing phone 3 smartphone teased

గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌ :
నథింగ్ సంస్థ తాజా టీజర్‌ ఆధారంగా నథింగ్‌ ఫోన్‌ 3 మోడల్‌ గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌ తో (Glyph Matrix) లాంచ్ కానుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ కొత్త గ్లిఫ్‌ మ్యాట్రిక్స్ లైట్‌ను కమ్యూనికేషన్ రూపంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపింది. అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజాగా షేర్ చేసిన టీజర్‌లో గ్లిఫ్‌ మ్యాట్రిక్స్ డిజైన్‌ మినహా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌ :
నథింగ్‌ ఫోన్ 3 హ్యాండ్‌సెట్ చిప్‌సెట్‌ వివరాలను ఇటీవలే సంస్థ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపింది. ఆండ్రాయిడ్‌ వెర్షన్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా నథింగ్ సీఈవో కార్ల్‌ పై ఈ వివరాలను వెల్లడించారు.

పనితీరుపై ఫోకస్‌ :
ఇప్పటి వరకు డిజైన్‌, సాఫ్ట్‌వేర్ పైన ఎక్కువ ఫోకస్‌ చేసిన నంథింగ్‌.. నథింగ్‌ ఫోన్‌ 3 మాత్రం పనితీరుపై ముఖ్యంగా ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 2 తో పోలిస్తే 36 శాతం CPU, 88 శాతం GPU, 60 శాతం NPU పనితీరు మెరుగుపడుతుందని చెప్పారు. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ ను మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా చెన్నై ప్లాంట్‌ లో తయారీ చేయనున్నారు. లీక్స్‌ సహా ఇతర నివేదికల ఆధారంగా ఈ ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలతో అందుబాటులోకి వస్తుందని సమాచారం.

జులై 1 వ తేదీన లండన్‌లో జరిగే గ్లోబల్‌ ఈవెంట్‌ లో నథింగ్‌ ఫోన్‌ 3 తోపాటు నథింగ్‌ హెడ్‌ఫోన్‌ 1 కూడా విడుదల చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం జులై 1 రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
Nothing phone 3 smartphone teased to get Glyph Matrix ahead of launch on july 1 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X