Home
Mobile

నథింగ్‌ కొత్త ఫోన్ లాంచ్, చిప్‌సెట్‌, కెమెరా, డిస్‌ప్లే వివరాలు లీక్‌.. AI ఫీచర్‌లు కూడా..!

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రత్యేకమైన డిజైన్‌లో నథింగ్‌ ఫోన్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఇందులో భాగంగా నథింగ్‌ ఫోన్‌ 3a, 3a ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే నథింగ్ నుంచి త్వరలో నథింగ్ ఫోన్‌ 3 హ్యాండ్‌సెట్‌ (Nothing Phone 3 Smartphone) లాంచ్ కానుంది. నథింగ్ ఫోన్‌ 2 తర్వాత తరం వెర్షన్‌గా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 3 గురించి ఇప్పటికే అనేక లీక్స్‌ వచ్చాయి.

నథింగ్‌ ఫోన్‌ 2 స్మార్ట్‌ఫోన్ 2023 సంవత్సరం జులైలో విడుదల అయింది. నథింగ్‌ ఫోన్‌ 3 కూడా ఈ సంవత్సరం జులైలోనే విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. అయితే నథింగ్‌ సంస్థ ఈ ఫోన్‌ విడుదలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Nothing phone 3 smartphone

నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల 1.5K అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ చి‌ప్‌సెట్‌ మెరుగైన పనితీరు అందిస్తుందని చెబుతున్నారు.

మరియు ఈ హ్యాండ్‌సెట్ 5000mAh లేదా 5300mAh బ్యాటరీతో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50W ఫాస్ట్‌ ఛార్జింగ్ మరియు 20W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్ 2 హ్యాండ్‌సెట్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ కెమెరా విభాగం పరంగాను అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత లీక్స్‌ ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 3x పెరిస్కోప్‌ టెలిఫొటో లెన్స్‌, 50MP లేదా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారుగా రూ.50,000 గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ ముందు వెర్షన్‌ నథింగ్‌ ఫోన్ 2 రూ.44,999 ధరకు లాంచ్ అయింది. ఈ కొత్త వేరియంట్ అనేక అప్‌గ్రేడ్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ధర కూడా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* ఇటీవల అందుబాటులోకి వచ్చిన నథింగ్‌ ఫోన్ 3a ప్రో మోడల్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్‌ సౌండ్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని నథింగ్ వెల్లడించింది.

ఈ ఫోన్‌ OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 2X జూమ్‌తో 50MP శాంసంగ్‌ ప్రైమరీ కెమెరా మరియు OIS, EIS, 6x ఇన్‌ సెన్సార్‌, 60x డిజిటల్‌ జూమ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 50MP కెమెరాను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 3 smartphone tipped to launch in july 2025 here are the expected features in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X