గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో నథింగ్ ఫోన్ 3.. జులై 1 న విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు
Nothing Phone 3 : నథింగ్ సంస్థ జులై 1 వ తేదీన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం జులై 1 రాత్రి 10:30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇందులో నథింగ్ ఫోన్ 3, నథింగ్ హెడ్‌ఫోన్స్ 1 విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన చిప్‌సెట్ సహా ఇతర వివరాలు వెల్లడయ్యాయి.
అయితే తాజాగా నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3 Geekbench Listing) తాజాగా గీక్‌బెంచ్ లిస్టింగ్ అయింది. GSMArena ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. Nothing A024 మోడల్ నంబర్ తో కనిపించింది. Armv8 ఆర్కిటెక్చర్ తో ఆక్టాకోర్ చిప్‌సెట్, 2.02GHz ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది.

స్నా్ప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ :
ఇప్పటికే విడుదల అయిన వివరాల ఆధారంగా ఈ ఫోన్ స్నా్ప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఇప్పటి వరకు విడుదల అయిన నథింగ్ ఫోన్లు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉన్నాయి. అయితే నథింగ్ ఫోన్ 3 మోడల్ మాత్రం గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌కు బదులుగా గ్లిఫ్ మ్యాట్రిక్స్ డిజైన్ లో లాంచ్ కానుంది. ఇటీవల విడుదల అయిన టీజర్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
నథింగ్ ఫోన్ 3 అంచనా వివరాలు :
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా ఈ నథింగ్ అప్ కమింగ్ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5150mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ లెన్స్, 50MP అల్ట్రావైడ్ లెన్స్‌తోపాటు 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.5 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 5 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని ఇటీవల నథింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ NFC తోపాటు eSIM సపోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది.
నథింగ్ ఫోన్ 2 తో ఫోన్ 3 అధిక ధరను కలిగి ఉండనుంది. ఇప్పటికే ఈ ఫోన్ ధర వివరాలను నథింగ్ సీఈవో కార్ల్ పై లీక్ చేశారు. అయితే భారత్ మార్కెట్ లో రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ తోపాటు నథింగ్ హెడ్‌ఫోన్ 1 (Nothing Headphone 1) కూడా జులై 1 న లాంచ్ కానుంది.


Click it and Unblock the Notifications








