నథింగ్ ఫోన్ 3 లో ఈ ఫీచర్ మిస్ అవుతుందా.. తాజాగా సంస్థ షేర్ చేసిన వీడియోలో ఏముంది..?
Nothing Phone 3 : నథింగ్ నుంచి ఈ సంవత్సరం జులై నెలలో నథింగ్ ఫోన్ 3 హ్యాండ్‌సెట్ లాంచ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవలే ఈ ఫోన్ ధర రేంజ్ ను నథింగ్ సీఈవో కార్ల్ పై వెల్లడించారు. ఈ ఫోన్ నథింగ్ తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా లాంచ్ కానుంది. అయితే తాజాగా నథింగ్ సంస్థ ఓ వీడియోను షేర్ చేసింది.
డిజైన్ వెంటనే గుర్తుపట్టవచ్చు..! :
నథింగ్ ఫోన్ అంటే చాలా మంది డిజైన్ వెంటనే గుర్తుకువస్తుంది. దీంతోపాటు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ కూడా గుర్తుకువస్తుంది. మార్కెట్‌లో ఎన్ని ఫోన్‌లు ఉన్నా ఈ రెండింటితో నథింగ్ ఫోన్‌ను వెంటనే గుర్తుపట్టవచ్చు. నథింగ్ ఫోన్ 1 మరియు ఫోన్ 2 తో పోలిస్తే నథింగ్ ఫోన్ 3 అనేక అప్‌గ్రేడ్స్ తో అందుబాటులోకి రానుంది.

వీడియో షేర్ చేసిన నథింగ్ :
నథింగ్ తాజాగా షేర్ చేసిన వీడియో ఆధారంగా నథింగ్ ఫోన్ 3 లో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ కనిపించదని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వెల్లడించలేదు. మరియు కేవలం నథింగ్ ఫోన్ 3 వరకే ఈ నిర్ణయం పరిమితం అవుతుందా భవిష్యత్‌లో వచ్చే అన్ని ఫోన్‌లకు ఈ నిర్ణయం వర్తిస్తుందా అనేది తెలియలేదు.
ఫోన్ బ్యాక్ ప్యానల్ వద్ద LED లైట్‌ల సిరీస్ తో గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్‌లు, బ్యాటరీ ఛార్జింగ్ సమయంలో LED లైట్లు వెలుగుతుంటాయి. నథింగ్ ఫోన్ 1 నుంచి ఇటీవల అందుబాటులోకి వచ్చిన నథింగ్ ఫోన్ 3 ప్రో మోడల్ వరకు అన్ని ఫోన్‌లు గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉన్నాయి.
We killed the Glyph Interface. pic.twitter.com/tescIT8ICd
— Nothing India (@nothingindia) May 29, 2025
తొలి ఫ్లాగ్‌షిప్ మోడల్ :
నథింగ్ ఫోన్ 3 మోడల్ జులై 2025 లో విడుదల కానుంది. గత మోడల్స్‌తో పోలిస్తే చిప్‌సెట్, కెమెరాలు, డిజైన్ పరంగా అత్యంత మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది. గత నెలలో నథింగ్ సీఈవో కార్ల్ పై ఈ ఫోన్ ధర వివరాలు వెల్లడించారు. GBP 800 ( భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.90000 ) గా ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్ టైటానియం ఫ్రేమ్ లేదా రీన్‌పోర్స్డ్ గ్లాస్ లేదా సిరామిక్ మెటీరియల్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ శక్తవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9400 లేదా డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరియు బెస్ట్ సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కెమెరా విభాగం పరంగా నథింగ్ ఫోన్ 3 హ్యాండ్‌సెట్ ట్రిపుల్ కెమెరాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు బ్యాటరీ పరంగా 5000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








