Home
Mobile

నథింగ్‌ నుంచి తొలి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!

Nothing Phone 3 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌ నుంచి ఫోన్‌ 3 మోడల్‌ గురించి ఇటీవల అనేక వివరాలు వెల్లడవుతున్నాయి. నథింగ్ సీఈవో కార్ల్‌ పై ఇటీవలే ఈ ఫోన్ ధర వివరాలు వెల్లడించారు. దీని ఆధారంగా ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌లో ప్రీమియం డిజైన్‌ సహా బెస్ట్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని తెలిసింది. తాజాగా నథింగ్‌ ఫోన్‌ 3 విడుదల వివరాలను సంస్థ వెల్లడించింది.

ఎప్పుడు విడుదల కానుంది? :
సంస్థ వెల్లడించిన వివరాల ఆధారంగా నథింగ్ ఫోన్ 3 గ్లోబల్‌ మార్కెట్‌లో జులై 2025 లో విడుదల కానుంది. నథింగ్‌ తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా లాంచ్‌ కానుందని తెలిపింది. పనితీరు పరంగా అనేక మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. మరియు ప్రీమియం మెటీరియల్స్‌తో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

Nothing Phone 3 telugu news updates

ఎంత ధరలో విడుదల అవుతుంది? :
ఇటీవలే నథింగ్‌ సీఈవో కార్ల్‌ పై ఈ హ్యాండ్‌సెట్‌ ధర రేంజ్‌ వివరాలను లీక్‌ చేశారు. ఈ ఫోన్ ధర సుమారుగా EUR 800 గా ఉంటుందని చెప్పారు. అంటే భారత్‌ కరెన్సీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌ ధర సుమారుగా రూ.90,500 గా ఉంటుంది. అయితే భారత్‌ మార్కెట్‌లో అంత భారీ ఉండే అవకాశం లేదని, సుమారు రూ.55000 ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.

నథింగ్‌ సంస్థ నుంచి ఫోన్‌ 3 మోడల్‌ తొలి ఫ్లాగ్‌షిప్‌ డిజైన్‌, ఫీచర్‌లతో లాంచ్‌ కానుంది. టైటానియం ఫ్రేమ్ లేదా రీన్‌పోర్స్డ్‌ గ్లాస్‌ లేదా సిరామిక్‌ మెటీరియల్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌ లేదా మీడియాటెక్‌ డైమెన్సిటీ 9400 లేదా డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

దీంతోపాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. బ్యాటరీ పరంగా 5000mAh లేదా భారీ బ్యాటరీని అందిస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ప్రైమరీ, పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా (OIS, EIS), 50MP శాంసంగ్ JN1 అల్ట్రావైడ్‌ కెమెరా (EIS) ను కలిగి ఉంది. ముందువైపు 32MP సోనీ IMX615 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

Take a Poll

ఈ సంవత్సరం మార్చి నెలలో నథింగ్ ఫోన్‌ 3a సిరీస్‌ లాంచ్‌ అయింది. ఇందులో నథింగ్ ఫోన్‌ 3a, ఫోన్‌ 3a ప్రో మోడల్స్‌ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 పైన పనిచేస్తున్నాయి.

థింగ్‌ ఫోన్ 3a ఫోన్‌ 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. నథింగ్‌ ఫోన్ 3a ప్రో 50MP + 50MP + 8MP కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3 will be the brands first flagship smartphone to launch in july 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X