Home
Mobile

అదిరిపోయే డిజైన్‌, ప్లాగ్‌షిప్‌ పనితీరుతో నథింగ్ ఫోన్‌ 3 విడుదల.. ధర, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు..!

నథింగ్ ఫోన్‌ 3 స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. నథింగ్ తొలి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌గా లాంచ్ అయింది. గత మోడల్స్‌తో పోలిస్తే డిజైన్ పరంగా కీలక మార్పులు చేశారు. నథింగ్‌ ఫోన్‌ 2 తో పోలిస్తే అత్యధిక ధరకు విడుదల చేసింది. నథింగ్ ఫోన్‌ 2 విడుదల అయిన సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఫోన్‌ 3 ను తీసుకొచ్చింది. డిజైన్‌ సహా పనితీరు మెరుగుపరిచేందుకు వీలుగా అనేక మార్పులు చేశారు.

నథింగ్‌ ఫోన్ 3 గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు విడుదల అయిన అన్ని మోడల్స్‌ గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. ప్రీమియం మెటీరియల్స్‌ను కలిగి ఉంది. గత మోడల్స్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ మాడ్యూలర్ డిజైన్‌తో కూడిన బోల్డ్‌ జియోమెట్రీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 1.87 mm బెజెల్స్‌ను కలిగి ఉంది.

Nothing Phone 3 with Snapdragon 8s gen 4 chipset and glyph matrix

నథింగ్‌ ఫోన్‌ 3 స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
నథింగ్‌ ఫోన్‌ 3 ఫోన్‌ 6.67 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 92.89 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ ఫోన్ అల్ట్రా థిన్‌, యూనిఫామ్‌ బెజెల్స్‌ను కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 3 కంటే ముందు విడుదల అయిన అన్ని మోడల్స్ గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండగా.. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ మాత్రం గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌ డిజైన్‌తో అందుబాటులో ఉంది. ఇందులో గ్లిఫ్‌ మిర్రర్‌, డిజిటల్‌ క్లాక్‌, స్టాప్‌ వాచ్‌, బ్యాటరీ ఇండికేటర్‌, సోలార్‌ క్లాక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్‌ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 16GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.5 ను కలిగి ఉంది. 2025 మూడో త్రైమాసికంలో ఆండ్రాయిడ్‌ 16 అప్‌డేట్‌ వస్తుందని నథింగ్ వెల్లడించింది.

Nothing Phone 3 with Snapdragon 8s gen 4 chipset and glyph matrix

ఈ ఫోన్‌ 5 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని నథింగ్‌ తెలిపింది. ఈ ఫోన్‌లో Essential search, ఫ్లిప్‌ టూ రికార్డు, Essential Space వంటి ఫీచర్లున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 65W ఫాస్ట్‌ ఛార్జింగ్, 15W వైర్‌లైస్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh సిలికాన్‌ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ప్రో గ్రేడ్‌ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.

Nothing Phone 3 with Snapdragon 8s gen 4 chipset and glyph matrix

నథింగ్‌ ఫోన్‌ 3 ధర, సేల్‌ వివరాలు :
ఈ ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.62999 (బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో కలిపి) గా ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.72999 (బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజీ ఆఫర్లతో కలిపి) గా ఉంది. ఇవాళ్టి (జులై 1) నుంచే ముందస్తు బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

Take a Poll

ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి రూ.14999 విలువైన నథింగ్‌ ఇయర్‌ బడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ఫోన్‌ సేల్‌ జులై 15 నుంచి ప్రారంభం కానుంది. అదనపు రుసుం లేకుండా 1 సంవత్సరం పాటు వారంటీని అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌, విజయ్ సేల్స్‌, క్రోమా సహా ఇతర రిటైల్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3 with Snapdragon 8s gen 4 chipset and glyph matrix launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X