నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ విడుదల.. అమోలెడ్ డిస్‌ప్లే, 6 ఏళ్ల వరకు అప్‌డేట్స్, 50MP కెమెరా..!
Nothing Phone 3a Lite 5G Smartphone : నథింగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లోకి వచ్చింది. నథింగ్ ఫోన్ 3a లైట్ 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ కాగా.. ఇవాళ భారత్‌లో విడుదల అయింది. ఇప్పటికే ఫోన్ 3a సిరీస్‌లో అనేక మోడల్స్ ఉండగా.. తాజాగా ఈ సిరీస్‌లోకి కొత్త వేరియంట్ వచ్చింది. గ్లిఫ్ లైట్ తో ఈ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ వివరాలు.
స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 387 PPI పిక్సల్ డెన్సిటి, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. Panda గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చు.
వర్చువల్ ర్యామ్ ద్వారా 8GB వరకు ర్యామ్‌ను అదనంగా పొడిగించుకోవచ్చు. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. IP54 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తోపాటు మరో కెమెరా ఉంది.
ఈ ఫోన్ వెనుక ఉన్న కెమెరాలు 30fps తో 4K వీడియోలు, 120fps తో 1080p స్లో మోషన్ వీడియోలను రికార్డు చేయవచ్చు. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ మోషన్ క్యాప్చర్, మైక్రో మోడ్, నైట్ మోడ్, ఆటో ట్యూన్, పొర్ట్రెయిట్ మోడ్, అల్ట్రా XDR ఫోటోస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ నథింగ్ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 5W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. 5G, బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, BDS, QZSS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
నథింగ్ ఫోన్ 3a లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
నథింగ్ ఫోన్ 3a లైట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999 గా ఉంది. డిసెంబర్ 5 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ సహా ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్స్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ICICI, వన్‌కార్డ్ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ వైట్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








