Home
Mobile

భారత్‌ మార్కెట్‌లోకి నథింగ్‌ ఫోన్ 3a లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌.. కీలక వివరాలు వెల్లడి..!

నథింగ్‌ సంస్థ ఇటీవల గ్లోబల్‌ మార్కెట్లో అక్టోబర్ నెలలో నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. అయితే ఈ ఫోన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌ లో కూడా (Nothing Phone 3a Lite 5G Phone india launch) విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను నథింగ్ సంస్థ తన X హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అయితే భారత్‌ లో రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

త్వరలో భారత్‌ మార్కెట్‌లో :
నథింగ్‌ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌ లో విడుదల చేయనున్నట్లు X హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్‌ చేసింది. ఈ ఫోన్‌ వైట్‌, బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ గ్లోబల్‌ వేరియంట్‌ తరహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లే.. భారత్‌ వేరియంట్‌ లోనూ ఉండే అవకాశం ఉంది.

Nothing Phone 3a Lite 5G smartphone india launch

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
నథింగ్‌ ఫోన్‌ 3a లైట్ భారత్ వేరియంట్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌ తో పనిచేస్తుంది.

5000mAh బ్యాటరీ :
ఈ చిప్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసే అవకాశం ఉంది. అయితే మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ నథింగ్ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఛార్జింగ్‌ ను సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లే :
ఈ నథింగ్‌ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ (1080 x 2392 పిక్సల్స్) ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్, HDR ను సపోర్టు చేస్తుంది. Panda గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుందని అంచనా వేస్తున్నారు.

ట్రిపుల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, మరో కెమెరాను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

Take a Poll

కనెక్టివిటీ పరంగా గ్లోబల్ వేరియంట్ 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై 6, BDS, QZSS, GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. భద్రత కోసం ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ కూడా ఉంది. అయితే భారత్‌ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Nothing Phone 3a Lite 5G smartphone confirmed to launch in india, here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X