భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వచ్చేసింది.. గ్లోబల్ వేరియంట్ తరహాలోనే ఫీచర్లు ఉంటాయా..?
Nothing Phone 3a Lite Smartphone : నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్ లో విడుదల అయింది. అయితే త్వరలో ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్ లోనూ లాంచ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక వివరాలను నథింగ్ సంస్థ వెల్లడించింది. భారత్ లోనూ గ్లోబల్ వేరియంట్ తరహా ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రూ.20 వేల కంటే తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
భారత్‌లో ఎప్పుడు విడుదల కానుంది? :
నథింగ్ ఫోన్ 3a లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో నవంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. అయితే గ్లోబల్ వేరియంట్ తరహాలో స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుందని భావిస్తున్నాయి. అయితే నథింగ్ మాత్రమే ఎటువంటి ప్రకటన చేయలేదు.

గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ఠ HDR బ్రైట్‌నెస్ తో 6.77 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. మైక్రో SD కార్డుతో 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 16 :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు 5W రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
ట్రిపుల్ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్, 2MP మ్యాక్రో కెమెరాలున్నాయి. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఈ ఫోన్ ముందు, వెనుక వైపు Panda గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS, BDS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ యూరప్ మార్కెట్‌లో EUR 249 గా ఉంది. భారత్ కరెన్సీ ప్రకారం సుమారు రూ.25 వేల ధర గా ఉంది.
భారత్‌లో ఎంత ధరకు లాంచ్ కానుంది? :
భారత్ మార్కెట్‌లో ఇప్పటి వరకు నథింగ్ లాంచ్ చేసిన అన్ని మోడల్స్ ధరలు రూ.20 వేల కంటే అధికంగానే ఉన్నాయి. అయితే నథింగ్ సబ్‌బ్రాండ్‌గా వచ్చిన CMF ఫోన్‌లు మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న నథింగ్ ఫోన్ మాత్రమే రూ.20 ధర సెగ్మెంట్‌లో విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications








