Home
Mobile

నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్ సేల్‌ ప్రారంభం.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ సహా..!

Nothing Phone 3a Lite 5G Smartphone Sale : నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ 5G స్మార్ట్‌ ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో గత నెల చివరి వారంలో విడుదల అయింది. ఈ ఫోన్‌ గ్లిఫ్‌ లైట్‌ తో అందుబాటులోకి వచ్చింది. అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ చిప్‌సెట్‌, 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. OIS, EIS సపోర్టుతో ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌, విజయ్‌ సేల్స్‌, క్రోమా సహా ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22999 గా ఉంది.

Nothing Phone 3a lite 5G smartphone sale

తొలి సేల్‌లో భాగంగా ఈ నథింగ్‌ ఫోన్‌ ను ICICI, వన్‌కార్డ్ కార్డులపై కొనుగోలు చేసి, రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్‌ వైట్‌, బ్లూ, బ్లాక్‌ కలర్ వేరియంట్స్‌ లో లభిస్తుంది. IP54 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

FHD+ అమోలెడ్ డిస్‌ప్లే :
నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ 5G హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల ఫుల్‌ HD+ ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌, 387 PPI పిక్సల్‌ డెన్సిటి, 2160Hz PWM డిమ్మింగ్‌ ను కలిగి ఉంది. Panda గ్లాస్‌ ప్రొటెక్షన్‌ తో అందుబాటులోకి వచ్చింది.

ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Nothing OS 3.5 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందవచ్చు.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ ను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ( OIS ), ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ ( EIS ) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులో ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్ లెన్స్‌ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16MP కెమెరా ఉంది.

రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ ఫోన్ కెమెరా విభాగం నైట్‌ మోడ్‌, మోషన్‌ క్యాప్చర్‌, మైక్రో మోడ్‌, ఆటో ట్యూన్‌, పొర్ట్రెయిట్ మోడ్‌, Ultra XDR ఫోటోస్‌ వంటి ఫీచర్‌ లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్, 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3a lite 5G smartphone sale is live in india here is the bank deal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X