నథింగ్ నుంచి లైట్ వేరియంట్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!
నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఈ సంవత్సరం తొలి భాగంలో విడుదల అయింది. అయితే త్వరలో నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. నథింగ్ నుంచి చివరగా నథింగ్ ఫోన్ 3 విడుదల అయింది. ఈ ఫోన్ రూ.79999 ప్రారంభ ధరకు ఇండియాలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 3a లైట్ స్మార్ట్‌ఫోన్ :
నథింగ్ ఫోన్ 3a లైట్ మోడల్ (Nothing Phone 3a Lite Smartphone) గురించి టిప్‌సెట్ సుధన్షు అంబోర్ అనేక వివరాలను వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో ఈ సంవత్సరం చివరలోగా విడుదల కానుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుందని చెప్పారు.

బడ్జెట్ రేంజ్ ధరలో అందుబాటులోకి! :
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది. అయితే భారత్ మార్కెట్ లో మరిన్ని స్టోరేజీ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్ రేంజ్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
* నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తోంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని నథింగ్ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఛార్జర్‌తో కేవలం 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని నథింగ్ చెబుతోంది.
50MP + 50MP + 32MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. 2x ఆప్టికల్, 30x డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ కెమెరా, 8MP సోని అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23,999, 8GB ర్యా్‌మ్ + 256GB స్టోరేజీ ధర రూ.25,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








