Home
Mobile

గ్లిఫ్‌ లైట్‌, 50MP కెమెరా, 4K వీడియో రికార్డింగ్‌, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!

Nothing Phone 3a lite Smartphone : నథింగ్‌ సంస్థ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 3a సిరీస్‌లో భాగంగా లైట్‌ వేరియంట్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ గ్లిఫ్‌ లైట్స్‌ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ నథింగ్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌, అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ వివరాలు.

నథింగ్‌ ఫోన్ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1000Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌. 387ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. దీంతోపాటు 2160Hz PWM డిమ్మింగ్, 1.07 బిలియన్ కలర్స్‌ ఉన్నాయి.

Nothing Phone 3a lite Smartphone features

గ్లిఫ్‌ లైట్‌ నోటిఫికేషన్‌ ఇండికేటర్‌ :
ఈ ఫోన్‌ ముందు, వైనుక ప్యానళ్లు Panda గ్లాస్‌ రక్షణను కలిగి ఉన్నాయి. వెనుక వైపు గ్లిఫ్‌ లైట్‌ నోటిఫికేషన్‌ ఇండికేటర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే ఉంది. ఈ నథింగ్ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పా్ష్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Nothing OS 3.5 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని నథింగ్‌ హామీ ఇచ్చింది.

Nothing Phone 3a lite Smartphone features

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) సపోర్టుతో 50MP ప్రైమరీ ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరాతోపాటు మరో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

ఈ ఫోన్ కెమెరాలు 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్‌, 60fps వద్ద 1080p రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 120fps వద్ద 1080p స్లో మోషన్ వీడియో రికార్డింగ్‌ సామర్థ్యం కూడా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ Truelens ఇంజిన్ 4.0 ను కలిగి ఉంది.

Nothing Phone 3a lite Smartphone features

ఈ నథింగ్‌ ఫోన్‌ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్ 33W వైర్‌ ఛార్జింగ్, 5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.3, వైఫై 6, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలిరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్ సెన్సర్ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది.

Take a Poll

నథింగ్ ఫోన్ 3a లైట్‌ ధర, సేల్‌ :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 249 (భారత కరెన్సీ ప్రకారం రూ.25,566), 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 279 (భారత కరెన్సీ ప్రకారం రూ.28647) గా ఉంది.

ఈ ఫోన్ ఇండియా వేరియంట్‌ ధర, సేల్‌ వివరాలు వెల్లడి కావాల్సిన ఉంది. అయితే భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్ 3a లైట్‌ మోడల్‌ ధర సుమారుగా రూ.20000 గా ఉండే అవకాశం ఉంది. బ్లాక్‌, వైట్‌ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3a lite Smartphone launched in india with Glyph light indicator and 50MP OIS, EIS Cam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X