మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా నథింగ్ ఫోన్ 3a సిరీస్ కెమెరా మాడ్యూల్ డిజైన్.. స్పెసిఫికేషన్‌ల వివరాలు..!
నథింగ్ నుంచి మార్చి 4 వ తేదీన నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఫోన్‌లు (Nothing Phone 3a Series) లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్ లో భాగంగా ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడళ్లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడవుతున్నాయి. నథింగ్ సంస్థ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ సిరీస్ అప్‌డేట్స్‌ను అందిస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా గత మోడల్‌తో పోలిస్తే త్వరలో విడుదల కానున్న స్మా్ర్ట్‌ఫోన్‌లు మెరుగైన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లను కలిగి ఉండనున్నాయి.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో :
గతవారం నథింగ్ సీఈవో కార్ల్ పై నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ తో పనిచేస్తుందని తెలిపారు. గత మోడళ్లు మీడియాటెక్ ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. అయితే తొలిసారిగా ఫోన్ 3a టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా మాడ్యూల్ డిజైన్ :
తాజాగా నథింగ్ 3a సిరీస్ గురించి కీలక అప్‌డేట్ వచ్చింది. సంస్థ ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను టీజ్ చేసింది. అయితే ఈ డిజైన్ ఫోన్ 3a లేదా ఫోన్ 3a ప్రో మోడల్‌కు సంబంధించిందా అనేది తెలియలేదు. ఈ టీజర్ ఆధారంగా ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సహా LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుందని తెలిసింది.
టెలిఫోటో కెమెరా :
దీంతోపాటు టెలిఫోటో కెమెరాను కూడా కలిగి ఉంటుందని తెలిసింది. అయితే ఈ కొత్త డిజైన్ ఆకట్టుకుంటోంది. ఇప్పటిక వరకు అందుబాటులో ఉన్న నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు వైడ్, అల్ట్రావైడ్ కెమెరాలను మాత్రమే కలిగి ఉన్నాయి. తొలిసారిగా ఆప్టికల్ జూమ్‌తో కూడిన కెమెరాలను కలిగి ఉండనున్నాయి.
See more. Capture more. Every detail crystal clear. pic.twitter.com/Iqxz6hnxto
— Nothing (@nothing) February 18, 2025
50MP లెన్స్ :
ఇప్పటికే లీక్ అయిన వివరాల ఆధారంగా నథింగ్ ఫోన్ 3a, నథింగ్ ఫోన్ 3a ప్రో మోడళ్లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. 3a మోడల్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతోపాటు 2x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
సోనీ కెమెరా :
అదే ప్రో మోడల్ (Nothing Phone 3a Pro) 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతోపాటు 50MP 1/1.95 అంగుళాల సోనీ LYT-600 టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 3x ఆప్టికల్ జూమ్, 60x ఆప్టికల్ హైబ్రిడ్ జూమ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది.
ప్రో మోడల్ స్పెసిఫికేషన్‌లు :
దీంతోపాటు ప్రో మోడల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.72 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 4nm స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ సహా Adreno 810 GPU చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ ఐఫోన్ తరహా యాక్షన్ బటన్ ను కలిగి ఉంటుంది.
ధర ఎంత ఉండే అవకాశం ఉంది? :
ఫోన్ 3a ప్రో మోడల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు రూ.30000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ధర సహా ఇతర స్పెసిఫికేషన్లపై నథింగ్ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








