Home
Mobile

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌, ట్రిపుల్ కెమెరాతో నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్.. మార్చి నెలలో విడుదల..!

నథింగ్ నుంచి మార్చి నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే దీనిపై సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 4 వ తేదీన నథింగ్‌ ఫోన్ 3a సిరీస్ (Nothing Phone 3a Series) విడుదల కానుంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి అనేక లీక్స్‌ వస్తున్నాయి. డిస్‌ప్లే, బ్యాటరీ, డిజైన్, కెమెరా సహా ఇతర వివరాలు వెల్లడవుతున్నాయి. అయితే గత మోడల్‌తో పోలిస్తే భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

తొలిసారిగా ఈ చిప్‌సెట్‌తో :
ముఖ్యంగా చిప్‌సెట్‌, కెమెరాల పరంగా మార్పులు ఉండనున్నాయని తెలుస్తోంది. తాజాగా ఫోన్ 3a సిరీస్‌ చిప్‌సెట్‌పై కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం. ఇప్పటికే భారత్‌లో అందుబాటులో ఉన్న నథింగ్ ఫోన్ 2a, 2a ప్లస్‌ మోడళ్లు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్‌లతో పనిచేస్తోన్నాయి.

Nothing phone 3a series

చిప్‌సెట్‌ పరంగా భారీగా అప్‌గ్రేడ్‌గా గుర్తించవచ్చు. నథింగ్‌ సంస్థ సీఈవో కార్ల్‌ పై ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే చిప్‌సెట్‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత నథింగ్‌ OS 3.1 ను కలిగి ఉండే అవకాశం ఉంది.

స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
నథింగ్‌ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. పాత మోడళ్ల తరహాలోనే 3a సిరీస్‌ ఫోన్‌లు కూడా గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

తొలిసారిగా టెలిఫోటో కెమెరా :
కెమెరా విభాగం పరంగానూ భారీ అప్‌గ్రేడ్‌లను ఆశించవచ్చు. ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2x ఆప్టికల్‌ జూమ్‌ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32MP కెమెరాను అమర్చి ఉంటుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్‌లు తొలిసారిగా టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఫోన్‌ 3a ప్లస్‌ స్మార్ట్‌ఫోన్ పెరిస్కోప్‌ టెలిఫోటో కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

గతంలో వచ్చిన టీజర్‌ ఆధారంగా ఐఫోన్ తరహా కెమెరా యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎలా ఉపయోగపడుతుందో సంస్థ వెల్లడించలేదు. ఇప్పటికే ఐఫోన్‌ మోడళ్లు ఈ ఫీచర్‌తో ప్రత్యేక గుర్తింపును పొందాయి. నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ మార్చి 4 వ తేదీ మధ్యాహ్నం 3PM గంటలకు విడుదల కానున్నాయి.

ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్‌ 2a 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 ను కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలతో పాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 3a series confirmed to get snapdragon chipset here are the other expected features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X