Home
Mobile

నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ల ప్రాసెసర్‌, కెమెరా, బ్యాటరీ, ధర వివరాలు లీక్‌..!!

నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ (Nothing Phone 3a Series) మార్చి 4 వ తేదీన భారత్ మార్కెట్‌ లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌ లో భాగంగా ఫోన్‌ 3a, ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్‌ లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సిరీస్‌ కు సంబంధించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. చిప్‌సెట్, కెమెరా మాడ్యూల్‌, డిజైన్ వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. అయితే విడుదల సమయంలో దగ్గరపడే కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. నథింగ్‌ సంస్థ కూడా క్రమంగా అనేక వివరాలను టీజ్‌ చేస్తోంది.

కీలక వివరాలను లీక్‌ :
తాజాగా నథింగ్‌ ఫోన్‌ 3a (Nothing Smartphones) సిరీస్‌ కీలక వివరాలను లీక్‌ అయ్యాయి. నథింగ్ కమ్యూనిటీ ఈవెంట్‌ లో వివరాలు వెల్లడయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ అయ్యాయి. ఇప్పటికే స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌, ట్రిపుల్‌ కెమెరా, టెలిఫోటో వంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.

Nothing Phone 3a Series

చిప్‌సెట్‌ వివరాలు :
నథింగ్ ఫోన్‌ 3a సిరీస్‌ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ తో లాంచ్ కానున్నాయని సీఈవో గతంలోనే వెల్లడించారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా నథింగ్‌ ఫోన్ 3a స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్‌లు :
ఈ నథింగ్‌ ఫోన్లు 3 సంవత్సరాల OS అప్‌డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. నథింగ్‌ ఫోన్‌ 3a సిరీస్‌ ఫోన్‌లు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో పుల్ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 2500 నిట్స్‌ ను కలిగి ఉంటుందని సమాచారం.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా రెండు వేరియంట్స్‌ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటాయి. తొలిసారిగా టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. నథింగ్‌ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెకండరీ కెమెరా, 10MP మరో లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

అదే ప్రో మోడల్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్, 50MP 1/1.95 అంగుళాల సోనీ LYT-600 టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), 3x ఆప్టికల్‌ జూమ్, 60x ఆప్టికల్ హైబ్రిడ్‌ జూమ్ సపోర్టును కలిగి ఉండే అవకాశం ఉంది.

ధర వివరాలు లీక్‌ :
నథింగ్ ఫోన్ 3a 50W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని సమాచారం. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ ధరల వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. యూరోపియన్‌ మార్కెట్‌లో ఫోన్‌ 3a 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 349 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.31,600), అదే 12GB ర్యా్మ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర EUR 399 (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.36,100) గా ఉంది.

ఎప్పుడు విడుదల కానుంది?
భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 4 వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు లాంచ్‌ కానుంది. బేస్‌ వేరియంట్‌ మార్చి 11 నుంచి, ప్రో మోడల్ సేల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ రెండు వేరియంట్‌లు కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3a Series Smartphones chipset camera battery price leaked ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X