ఇవాళ విడుదల కానున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. గత మోడల్ కంటే ఎన్నో ప్రత్యేకతలు..!
నథింగ్ ఫోన్ 3a సిరీస్ (Nothing Phone 3a Series Launch) ఇవాళ 3:30PM గంటలకు భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడల్స్ లాంచ్ కానున్నాయి. గత మోడల్ కంటే అనేక అప్‌గ్రేడ్స్‌తో కొత్త సిరీస్ అందుబాటులోకి రానుంది. చిప్‌సెట్, డిస్‌ప్లే, కెమెరా సహా అనేక మార్పులను గమనించవచ్చు. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి డిజైన్ సహా అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడయ్యాయి.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ :
గత మోడల్స్ తరహాలోనే నథింగ్ ఫోన్ 3a సిరీస్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రెండు ఫోన్‌లు 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లేలు Panda గ్లాస్ రక్షణ పొందనున్నాయని సమాచారం. అయితే కెమెరా పరంగా ఈ ఫోన్ రెండు మోడల్స్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి.

కెమెరా మాడ్యూల్ డిజైన్ :
నథింగ్ ఫోన్ 3a మోడల్ పిల్ షేప్ కెమెరా మాడ్యూల్‌తో కూడిన ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా సహా 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ప్రో మోడల్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 60x డిజిటల్ జూమ్ తో 50MP కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ముందువైపు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.
కెమెరా మాడ్యూల్ మినహా డిజైన్‌లో పెద్దగా మార్పులు లేవు. అయితే ఐఫోన్ తరహాలో యాక్షన్ బటన్‌ను తరహా ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీని పనితీరుపై పూర్తి వివరాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటాయని తెలుస్తోంది.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
నథింగ్ పాత మోడల్స్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఫోన్ 3a సిరీస్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని ఇప్పటికే సంస్థ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే రెండు ఫోన్‌లు ఒకే రకమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయా లేదా అనే వివరాలపై స్పష్టత లేదు.
నథింగ్ ఫోన్ 3a 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందని సమాచారం. ప్రారంభ ధర EUR 349 (భారత కరెన్సీలో సుమారు రూ.31600) గా ఉండే అవకాశం ఉంది. మరో వేరియంట్ ధర EUR 399 (భారత కరెన్సీలో రూ.36100) గా ఉండే అవకాశం ఉంది.
అదే ప్రో మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీతోనే లభిస్తుందని సమాచారం. ప్రారంభ ధర EUR 479 (భారత కరెన్సీలో రూ.43,400) గా ఉంటుందని తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ సిరీస్ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications








