ఇవాళ్టి నుంచి నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సేల్.. ఇలా చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు..!
నథింగ్ ఫోన్ 3a సిరీస్ ఇటీవల భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇందులో భాగంగా నథింగ్ ఫోన్ 3a, 3a ప్రో మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ రెండు వేరియంట్స్ సేల్ (Nothing Phone 3a Smartphone Sale) ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్ల ద్వారా గరిష్ఠంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ సహా 5000mAh బ్యాటరీ, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
ధర వివరాలు :
భారత్ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999 గా ఉంది. 8GB ర్యా్‌మ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుంది. ప్రో మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.33999 గా ఉంది. ఈ ప్రో మోడల్ బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుంది.

డిస్కౌంట్ ఆఫర్లు :
ఈ నథింగ్ ఫోన్‌ను HDFC బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల EMI ట్రాన్సాక్షన్‌లతో రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ ఫోన్ (Nothing Phone 3a) 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.

కెమెరా విభాగం పరంగా 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరా (OIS, EIS), f/2.0 అపేచర్, EIS, 2X ఆప్టికల్, 30X డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ కెమెరా, 8MP సోనీ అల్ట్రావైడ్ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ నథింగ్ ఫోన్ 3a సిరీస్ బేస్ వేరియంట్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 19 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్, 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని నథింగ్ తెలిపింది.

నథింగ్ ఫోన్ 3a ప్రో పూర్తి వివరాలు :
నథింగ్ ఫోన్ 3a ప్రో స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3a Pro) 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4nm ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తోంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది.
ప్రో మోడల్ OIS, EIS, 2X జూమ్‌తో 50MP శాంసంగ్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మరియు OIS, EIS, 6x ఇన్ సెన్సార్, 60x డిజిటల్ జూమ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. మరియు 50MP కెమెరాను అమర్చారు.
ప్రో మోడల్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 19 నిమిషాల్లో 50 శాతం, 56 నిమిషాల్లో 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు.
కనెక్టివిటీ పరంగా రెండు వేరియంట్స్ 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, 10 కొత్త రింగ్‌టోన్స్, నోటిఫికేషన్ సౌండ్‌ను సపోర్టు చేస్తుంది. గ్లిప్ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్ కంపోజర్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ ప్రోగ్రస్ ఫీచర్లున్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








