Home
Mobile

50MP + 50MP కెమెరాలు, ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 4 సంవత్సరాల అప్‌డేట్స్‌ ఫోన్‌పై డిస్కౌంట్!

Nothing Phone 3a Smartphone : నథింగ్ సంస్థ ఈ సంవత్సరం తొలి భాగంలో నథింగ్ ఫోన్ 3a సిరీస్‌ ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఫోన్‌ 3a, ఫోన్‌ 3a ప్రో మోడల్స్‌ విడుదల అయ్యాయి. నథింగ్‌ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్‌ ను ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ లో డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ‌గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌, వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ను పొందుతుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా :
విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యా్‌మ్ + 256GB స్టోరేజీ ధర రూ.26,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌ లో (Flipkart Big Bang Diwali Sale 2025) భాగంగా డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.23,999, రూ.25,999 గా ఉంది.

Nothing Phone 3a

బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ :
ఈ హ్యాండ్‌సెట్ ను SBI బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అంటే సుమారుగా రూ.2 వేల కంటే ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. విడుదల ధరతో పోలిస్తే మొత్తంగా రూ.3 వేల కంటే ఎక్కువ డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఫుల్ HD+ డిస్‌ప్లే :
నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ 6.77 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్, 1000Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే Panda గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ను పొందుతుంది. ఈ ఫోన్‌ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ తో అందుబాటులోకి వచ్చింది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత NothingOS 3.1 తో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందుతుందని నథింగ్ తెలిపింది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP శాంసంగ్‌ ప్రైమరీ కెమెరా (OIS, EIS), 50MP సోనీ కెమెరా, 8MP సోనీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ లను కలిగి ఉంది. మరియు 32MP కెమెరా సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

5000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 56 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చని నథింగ్‌ తెలిపింది. IP64 రేటింగ్‌ తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 3a smartphone gets best deal on flipkart Big bang diwali sale 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X