Home
Mobile

ఐఫోన్‌ తరహా ఫీచర్‌తో నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌.. కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్‌..!

నథింగ్‌ నుంచి మార్చి 4 వ తేదీన కొత్త ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే సంస్థ అధికారిక ప్రకటన చేసింది. నథింగ్‌ ఫోన్‌ 3a పేరుతో (Nothing Phone 3a Smartphone) విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఫోన్ 3a తోపాటు ప్రో మోడల్‌ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటికే అనేక లీక్స్‌ వస్తున్నాయి. అయితే నథింగ్‌ మాత్రమే అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

తాజాగా ఓ ఆసక్తికర ఫీచర్‌ వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్‌లు ఐఫోన్ తరహా ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కేవలం ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌లో ఉండే ఈ ఫీచర్‌ తొలిసారిగా నథింగ్ ఫోన్‌లోనూ కనిపించనుందని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 3a కెమెరా బటన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ తరహా కెమెరా బటన్‌ ఐఫోన్‌ 16 సిరీస్‌లో ఉంది. అయితే ఈ బటన్‌ యాక్షన్ బటన్‌ గా పనిచేస్తుందని తెలుస్తోంది.

Nothing Phone 3a

యాక్షన్‌ బటన్‌ను కలిగి ఉంటుందా? :
అయితే ఈ యాక్షన్‌ బటన్‌పై నథింగ్‌ సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. నథింగ్ కొత్త సిరీస్‌ హ్యాండ్‌సెట్‌లు బ్యాక్‌ ప్యానల్‌ వద్ద గ్లిఫ్‌ లైట్ ఇంటర్‌ ఫేస్‌తోపాటు LED లైట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. గత మోడళ్లు కూడా ఇదే తరహా ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉన్నాయి. ‌అయితే భారీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు కెమెరా విభాగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రో మోడల్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. బేస్‌ వేరియంట్‌ గత మోడల్‌ తరహాలోనే డ్యూయల్‌ కెమెరాలతో అందుబాటులో ఉంటుందని సమాచారం.

ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ :
ప్రో మోడల్‌ 50MP ప్రైమరీ కెమెరా, 50MP 2X టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంటుందని తెలుస్తోంది. అదే బ్యాటరీ పరంగా 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ :
చిప్‌సెట్‌ విషయానికి వస్తే క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్‌, స్పెసిఫికేషన్‌లపై నథింగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలో విడుదల కానుందని భావిస్తున్న ప్రో మోడల్‌ ధర నథింగ్‌ ఫోన్ 2a ప్లస్‌ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెసిఫికేషన్‌లు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్‌ 2a హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణ పొందుతుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

నథింగ్‌ ఫోన్‌ 2a ఫోన్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలతో పాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Nothing Phone 3a Smartphone teased to get iphone 16 series like action button
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X