Home
Mobile

Nothing Upcoming Phones నథింగ్ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ కీలక వివరాలు లీక్‌.. తొలిసారిగా టెలిఫోటో కెమెరాతో..?

నథింగ్‌ నుంచి ఇటీవల కీలక ప్రకటన వెలువడింది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ లను మార్చి 4 వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. అయితే హ్యాండ్‌సెట్‌ ల వివరాలు వెల్లడి కాలేదు. అయితే టిప్‌స్టర్ ఈ ఫోన్‌ కీలక వివరాలను లీక్‌ చేశారు. అయితే గత డివైజ్‌లతో పోలిస్తే.. మార్చి నెలలో విడుదల కానుందని భావిస్తున్న నథింగ్‌ ఫోన్‌ అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. టిప్‌స్టర్‌ విడుదల చేసిన వివరాల ఆధారంగా నథింగ్‌ ఫోన్ 3a (Nothing Phone 3a Smartphone) లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల అంచనా వివరాలు.

భారీ డిస్‌ప్లే :
టిప్‌స్టర్ గ్యాడ్జెట్స్‌ బిట్స్‌ (@gadgets_bits) వివరాల ఆధారంగా నథింగ్‌ ఫోన్‌ 3a మోడల్‌.. 6.8 అంగుళాల OLED భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో కలిగి ఉంటుంది. మరిన్ని డిస్‌ప్లే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Nothing phone 3a

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ :
దీంతోపాటు (Nothing Upcoming Smartphone) ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ అంచనా వేశారు. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.1 తో పనిచేసే అవకాశం ఉంది. గత మోడల్‌ మీడియాటెక్‌ చిప్‌సెట్‌ లను కలిగి ఉంది.

తొలిసారిగా టెలిఫోటో కెమెరా :
దీంతోపాటు కెమెరా విభాగం గతం కంటే మెరుగైన స్పెసిఫికేషన్‌ లను కలిగి ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా సహా 2x ఆప్టికల్‌ జూమింగ్‌ సామర్థ్యంతో 50MP కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

బ్యాటరీ వివరాలు :
నథింగ్‌ ఫోన్‌ 3a స్మార్ట్‌ఫోన్‌ 45W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ తోపాటు ప్రీమియం వెర్షన్‌ కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 3a ప్లస్‌ పేరుతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లో :
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సర్టిఫికేషన్‌ వెబ్‌సైట్‌లలో A059, A05P మోడల్‌ నంబర్‌ లతో కనిపించాయి. అయితే నథింగ్‌ ఫోన్‌ 3 కూడా వీటితోపాటు విడుదల కానుందా లేదా అనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. మార్చి 4 వ తేదీన ఈ రెండు ఫోన్‌లు లాంచ్‌ అయ్యే అవకాశం ఉండగా.. ఫోన్‌ 3 విడుదలపై స్పష్టత లేదు.

నథింగ్‌ ఫోన్ 2a స్పెసిఫికేషన్‌లు :
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నథింగ్‌ ఫోన్ 2a స్మార్ట్‌ ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 నథింగ్‌ OS 2.6 తో పనిచేస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

50MP + 50MP కెమెరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 3a specifications and features leaked expected to launch on march 4 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X