Home
Mobile

నథింగ్ ఫోన్ 4a ఫస్ట్‌ లుక్‌ విడుదల.. ట్రిపుల్‌ కెమెరాలు, గ్లిఫ్‌ బార్‌ సహా అనేక ప్రత్యేకతలు..!

Nothing Phone 4a Series : నథింగ్‌ అంటే అందరికీ డిజైన్‌ గుర్తొస్తుంది. అలాంటి మరో ప్రత్యేక డిజైన్‌తో నథింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ విడుదల కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నథింగ్‌ ఫోన్‌ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్‌ లాంచ్‌ కానున్నాయి. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ కూడా విడుదల అయింది. తాజాగా కీలక వివరాలు వెల్లడయ్యాయి.

నథింగ్‌ ఫోన్‌ 4a సిరీస్‌ భారత్‌ సహా గ్లోబల్‌ మార్కెట్‌లో మార్చి 5 వ తేదీన లాంచ్‌ కానుంది. భారత్‌లో సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. తాజాగా నథింగ్‌ ఫోన్‌ 4a బ్యాక్ ప్యానల్‌ డిజైన్‌ను (Nothing Phone 4a First Look) షేర్‌ చేసింది. ఎప్పటి లాగానే ట్రాన్స్‌పరెంట్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

Nothing Phone 4a First look

వైట్‌ కలర్‌ వేరియంట్‌ :
నథింగ్‌ తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా షేర్‌ చేసిన డిజైన్‌ ఆధారంగా ఈ ఫోన్‌ వైట్‌ కలర్‌ వేరియంట్‌లోనూ అందుబాటులోకి వస్తుంది. పిల్‌ ఆకారంలోని కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు కెమెరా లెన్స్‌లు పక్కపక్కనే ఉన్నాయి. మరో లెన్స్‌ కాస్త దూరంలో వేరుగా ఉంది. LED ఫ్లాష్‌ లైట్‌ కాస్త పైభాగాన అమర్చి ఉంది.

మినీ ఎల్‌ఈడీలతో గ్లిఫ్‌ బార్ :
గత వారం లాంచ్ అయిన టీజర్‌ ఆధారంగా ఈ సిరీస్‌ సరికొత్త గ్లిఫ్‌ బార్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మొత్తంగా 9 మినీ LED లు 6 లైటింగ్‌ జోన్‌లుగా అమర్చి ఉన్నాయి. దీంతోపాటు సంస్థ మరో ప్రకటన కూడా చేసింది. ఈ లైటింగ్‌ సిస్టమ్‌ గత వేరియంట్‌తో పోలిస్తే 40 శాతం అధికంగా బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ సిరీస్‌ ఫోన్‌లు పవర్‌, వాల్యూమ్‌ బటన్‌లు కుడి వైపున ఉన్నాయి. అదే విధంగా ఎడమ వైపున మరో బటన్‌ను గమనించవచ్చు. దీంతోపాటు చిప్‌సెట్‌ వివరాలను కూడా నథింగ్‌ వెల్లడించింది. ఈ రెండు ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ చిప్‌తో పనిచేస్తాయని తెలిపింది. అయితే కచ్చితమైన మోడల్‌ నంబర్లను వెల్లడించలేదు.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌ :
ప్రస్తుత అంచనా వివరాల ఆధారంగా స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 4 చిప్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు 50W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

ఈ నథింగ్‌ సిరీస్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల LTPS OLED డిస్‌ప్లేతో లాంచ్‌ కానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ వెనుక వైపు 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే నథింగ్‌ ఈ స్పెసిఫికేషన్లపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భారత్‌ మార్కెట్‌లో నథింగ్ ఫోన్‌ 4a హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.35000 గా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ మార్చి 5 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. దీంతోపాటు నథింగ్ ఇటీవల ఇండియాలో తొలిసారిగా ప్రారంభించిన బెంగళూరు రిటైల్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 4a First look revealed in india ahead of launch on march 5 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X