Home
Mobile

వచ్చే నెలలో నథింగ్‌ ఫోన్ 4a సిరీస్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ధర వివరాలు..!

Nothing Phone 4a Series Smartphones : నథింగ్ సంస్థ ఇటీవల భారత్ మార్కెట్‌ లో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను బెంగూళూరులో ఫిబ్రవరి 14 వ తేదీన ప్రారంభించింది. ప్రారంభం రోజుల అనేక ప్రత్యేక ఆఫర్లను కూడా అందించింది. భారత్‌లో గత డిసెంబర్‌లో నథింగ్‌ ఫోన్‌ 3a కమ్యూనిటీ ఎడిషన్, నథింగ్‌ ఫోన్ 3a లైట్ మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో నథింగ్‌ ఫోన్ 4a సిరీస్ విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది :
నథింగ్‌ సీఈవో కార్ల్‌ పై (Carl Pei) X పోస్ట్‌ ఆధారంగా ఈ సిరీస్‌ త్వరలోనే భారత్‌ సహా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల అయింది. అయితే ఈ సిరీస్‌ మార్చి 5 వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఆపిల్‌ ఈవెంట్‌ 2026 మార్చి 4 వ తేదీనే జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే నథింగ్‌ అప్‌కమింగ్‌ సిరీస్‌ వివరాలు వెల్లడయ్యాయి.

Nothing Phone 4a Series launch

నథింగ్ ఫోన్ 4a సిరీస్‌ లో భాగంగా ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ గురించి అధికారికంగా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ సిరీస్‌ సరికొత్త డిజైన్, ఆకట్టుకొనే కలర్స్‌ లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

డిస్‌ప్లే, చిప్‌సెట్‌ అంచనా వివరాలు :
నథింగ్‌ ఫోన్ 4a, 4a ప్రో మోడల్స్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఫుల్‌ HD+ లేదా 1.5K డిస్‌ప్లే రిజల్యూషన్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 చిప్‌సెట్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేసే అవకాశం ఉంది.

కెమెరా విభాగం :
గత సిరీస్‌ మాదిరిగానే 4a సిరీస్ కూడా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా యూనిట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రో వేరియంట్‌ లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ సామర్థ్యం :
నథింగ్‌ ఫోన్ 4a ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 5100mAh లేదా 5200mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు. 50W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ IP65 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.

భారత్‌ మార్కెట్‌లో నథింగ్‌ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారుగా రూ.30,000 గా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ ప్రారంభ ధర రూ.40,000 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై నథింగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Nothing Phone 4a Series launch confirmed in india global markets here are the expected specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X