Home
Mobile

నథింగ్‌ ఫోన్‌లపై కీలక వివరాలు లీక్‌.. స్పెసిఫికేషన్‌లు, విడుదల వివరాలు..!

Nothing Phone 4a Series Smartphones : నథింగ్‌ సంస్థ సహా వ్యవస్థాపకుడు కార్ల్‌పై కీలక వివరాలను వెల్లడించారు. గ్లోబల్‌ మార్కెట్‌లో త్వరలో నథింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ విడుదల కానుందని తెలిపారు. అయితే నథింగ్‌ ఫోన్ 4 మోడల్‌ ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. నథింగ్‌ ఫోన్ 4a సిరీస్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది? :
టిప్‌స్టర్‌ యోగేష్‌ బ్రార్‌ అందించిన వివరాల ఆధారంగా నథింగ్‌ ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో స్మార్ట్‌ఫోన్‌లు గ్లోబల్‌ మార్కెట్‌లో వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి 5 వ తేదీన విడుదల కానుందని టిప్‌స్టర్‌ చెబుతున్నాయి. అయితే గత సంవత్సరం లాంచ్‌ అయిన నథింగ్‌ ఫోన్ 3a సిరీస్‌తో పోలిస్తే, అధిక ధరకు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

nothing phone 4a series

పెద్ద బ్యాటరీ! :
నథింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు గత వెర్షన్‌తో పోలిస్తే పెద్ద బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ మెరుగుపరిచిన గ్లిప్‌ ఇంటర్‌ఫేస్‌ లేదా నథింగ్‌ ఫోన్ 3 తరహాలో డాట్‌ మ్యాట్రిక్స్‌ డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌! :
ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌ 12GB ర్యామ్, UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. అదే విధంగా 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ సిరీస్‌ ఫోన్లు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన కెమెరాల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రో మోడల్‌ మిగిలిన కెమెరాలతోపాటు టెలిఫోటో లెన్స్‌ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఎంత ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? :
భారత్‌ మార్కెట్‌లో నథింగ్ ఫోన్‌ 4a స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ.30000 కంటేగా ఉండే అవకాశం ఉంది. అదే ప్రో మోడల్‌ రూ.40,000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, ధర వివరాలపై నథింగ్‌ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు.

నథింగ్ నుంచి ఇటీవల ఫోన్ 3a లైట్‌ స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల ఫుల్ HD+ ఫ్లెక్సిబుల్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుక వైపు గ్లిఫ్‌ లైట్‌ నోటిఫికేషన్‌ ఇండికేటర్‌ను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Nothing OS 3.5 తో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) సపోర్టుతో 50MP ప్రైమరీ ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 33W వైర్‌ ఛార్జింగ్, 5W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
nothing phone 4a series launch timeline tipped, expected specifications and price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X