Home
Mobile

మరో ప్రత్యేక డిజైన్‌తో నథింగ్ ఫోన్‌ 4a సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు.. స్నాప్‌డ్రాగన్‌ సహా అంచనా స్పెసిఫికేషన్లు..!

Nothing Phone 4a Series : నథింగ్‌ నుంచి వచ్చే నెలలో నథింగ్‌ ఫోన్ 4a సిరీస్‌ విడుదల కానుంది. ఇప్పటికే వెల్లడయిన వివరాల ఆధారంగా మార్చి 5 వ తేదీ సాయంత్రం 4 గంటలకు భారత్‌ మార్కెట్లో లాంచ్‌ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఫోన్‌ 4a, ఫోన్‌ 4a ప్రో మోడల్స్‌ లాంచ్ కానున్నాయి. అయితే నథింగ్ అంటేనే ప్రత్యేక డిజైన్ గుర్తొస్తుంది. సంస్థ నుంచి ఇప్పటి వరకు లాంచ్‌ అయిన అన్ని మోడల్స్‌ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ :
అయితే నథింగ్ ఫోన్ 4a సిరీస్ కూడా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. తాజాగా విడుదల అయిన టీజర్‌ ఆధారంగా గ్లిఫ్‌ బార్‌ ను కలిగి ఉంటుంది. మినీ LED లతో ఈ డిజైన్‌ ఉంటుంది. ఈ డిజైన్‌ నోటిఫికేషన్లు, స్టేటస్‌ ఇండికేటర్‌గా ఉంటుందని తెలుస్తోంది.

Nothing Phone 4a Series

గత సిరీస్‌ ఫోన్‌లతో పోలిస్తే త్వరలో లాంచ్‌ కానున్న సిరీస్‌ బ్యాక్ ప్యానల్‌ లైటింగ్‌ సిస్టమ్ ఏకంగా 40 శాతం అధిక బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని నథింగ్‌ చెబుతోంది. గత మోడల్ గ్లిఫ్‌ మ్యాట్రిక్స్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ 4a సిరీస్‌ కెమెరా మాడ్యుల్‌ వద్ద ఈ లైటింగ్‌ డిజైన్‌ అమర్చి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ :
నథింగ్‌ ఫోన్ 4a, ఫోన్‌ 4a ప్రో స్మార్ట్‌ఫోన్లు స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపింది. అయితే మోడల్‌ నంబర్‌ను మాత్రం వెల్లడించలేదు. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 4 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు.

నథింగ్ ఫోన్‌ 4a సిరీస్ భారత్‌ మార్కెట్‌లో విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ సహా బెంగళూరులో నథింగ్‌ ఇటీవల ప్రారంభించిన రిటైల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే సేల్‌ తేదీ సహా ఇతర ఆఫర్ల వివరాలు వెల్లడి కానున్నాయి. బేస్‌ వేరియంట్‌ రూ.35 వేలు, ప్రో వేరియంట్‌ రూ.41999 ప్రారంభ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఫుల్‌ HD+ డిస్‌ప్లే! :
నథింగ్‌ ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 1.5K ఫుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బేసే వేరియంట్ 5100mAh, ప్రో వేరియంట్ 5200mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. 50W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

కెమెరాల అంచనా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ, 50MP టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటాయని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్‌ మరింత నాణ్యమైన కెమెరాలు ఉండే అవకాశం ఉంది. IP65 రేటింగ్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

నథింగ్ ఫోన్ 4a సిరీస్‌ లైటింగ్‌ సిస్టమ్‌, చిప్‌సెట్, విడుదల తేదీ మినహా ఇతర స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Nothing Phone 4a Series will launch with new glyph bar interface and snapdragon chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X