ఆకట్టుకొనే డిజైన్‌తో నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్.. గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్, 50MP + 50MP కెమెరాలతోపాటు..!
Nothing Phone 4a Smartphone : నథింగ్ ఫోన్ 4a సిరీస్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్ లాంచ్ కానున్నాయి. గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. 50MP, 50MP కెమెరాలున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మార్చి 13 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.
నథింగ్ ఫోన్ 4a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 440 ppi పిక్సల్ డెన్సిటీ, 1.07 బిలియన్ కలర్స్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్ :
ఈ ఫోన్ గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇందులో 63 మినీ LEDలు, 6 జోన్లను కలిగి ఉంది. గ్లిఫ్ టైమర్, వాల్యూమ్ ఇండికేటర్, లైవ్ నోటిఫికేషన్స్, గ్లిఫ్ టార్చ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్లిఫ్ ప్రోగ్రెస్, ఫ్లిప్ టు గ్లిఫ్, కెమెరా కౌంట్‌డౌన్, ఫ్లిప్ టు రికార్డు వంటి ఫీచర్లు ఉన్నాయి.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ OS 4.1 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP శాంసంగ్ GN9 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు OIS, 70x అల్ట్రా జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 కెమెరా, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP సోనీ IMX355 కెమెరా ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP శాంసంగ్ KD1 కెమెరా ఉంది. 30fps తో 4k వీడియోలను రికార్డింగ్ చేయవచ్చు. 50W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. 1-100 శాతం ఛార్జింగ్‌ను 64 నిమిషాల్లో పూర్తి చేయవచ్చని నథింగ్ చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.4, వైఫై 6, NFC, GPS, QZSS, GLONASS, BeiDou, Galileo, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. యాంబియంట్ లైట్, యాక్సెలిరోమీటర్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సర్‌లు ఉన్నాయి. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పా్‌ష్ రెసిస్టెంట్‌గా ఉంది.
నథింగ్ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంది.
ఈ ఫోన్ సేల్ మార్చి 13 నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వైట్, పింక్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు గరిష్ఠంగా రూ.6 వేల వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








