50MP + 50MP + 32MP కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్, గ్లిఫ్‌బార్‌తో ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
Nothing Phone 4a Sale : నథింగ్ ఫోన్ 4a సిరీస్ ఇటీవల విడుదల అయింది. ఇందులో భాగంగా ఫోన్ 4a, ఫోన్ 4a ప్రో మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. నథింగ్ ఫోన్ 4a గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్ ను కలిగి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP + 50MP కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ను పొందుతుంది.
నథింగ్ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వైట్, పింక్, బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.31999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.34999 గా ఉంది.

రూ.6 వేల వరకు ఎక్స్ఛేంజీ బోనస్ :
ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37999 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్‌తోపాటు రూ.6 వేల వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు.
గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్ :
నథింగ్ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్ గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇందులో వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్ టైమర్, లైవ్ నోటిఫికేషన్స్, గ్లిఫ్ టార్చ్ ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఫ్లిప్ టు రికార్డు, గ్లిఫ్ ప్రోగ్రెస్, ఫ్లిప్ టు గ్లిఫ్, కెమెరా కౌంట్‌డౌన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ నథింగ్ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల LTPS అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 440 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత నథింగ్ OS 4.1 పైన పనిచేస్తుంది. 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుందని నథింగ్ హామీ ఇచ్చింది.
50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్ GN9 ప్రైమరీ కెమెరా, 70x అల్ట్రా జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 కెమెరా (OIS), 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 8MP సోనీ IMX355 కెమెరా ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 30fps తో 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది.
నథింగ్ ఫోన్ 4a స్మార్ట్‌ఫోన్ 5400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 50W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఛార్జర్‌తో కేవలం 64 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.
నథింగ్ ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్, యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సర్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








