Home
Mobile

నథింగ్‌ సబ్‌బ్రాండ్‌ CMF తొలి స్మార్ట్‌ఫోన్ కీలక ఫోటో లీక్‌... స్పెసిఫికేషన్‌లు, లాంచ్‌ వివరాలు..!!

నథింగ్‌ సబ్‌ బ్రాండ్‌ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ CMF ఫోన్‌ 1 విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆరెంజ్‌ మరియు బ్లాక్ రంగుల్లో కొనుగోలు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ CMF స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ఇతర వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా ఓ X యూజర్‌ ఈ సీఎంఎఫ్ ఫోన్‌ 1 కాన్సెప్ట్‌ ఇమేజ్‌ను (CMF phone 1 concept image) షేర్‌ చేశారు. అయితే ఇదే ఫైనల్‌ డిజైన్‌ కాదని తెలిపారు.

CMF ఫోన్‌ 1 అంచనా స్పెసిఫికేషన్‌లు :
సీఎంఎఫ్‌ ఫోన్‌ 1 హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా థిక్‌ బెజెల్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక కవర్‌ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) తయారుచేయబడుతుంది.

CMF phone 1 concept image shared expected

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.6 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 లేదా 7200 ప్రాసెసర్‌ పైన పనిచేసే అవకాశం ఉంది. 8GB ర్యామ్ మరియు 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. మూడు సంవత్సరాలపాటు OS, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చనని తెలుస్తోంది.

కెమెరా విభాగం పరంగా డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా సహా 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్ 5.3 మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు నథింగ్‌ లాక్‌ను కలిగి ఉంటుందని సమాచారం. గ్లిఫ్‌ LEDలు కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా ఓ యూజర్‌ ఈ హ్యాండ్‌సెట్‌ కాన్సెప్ట్‌ ఇమేజ్‌ను తన X అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారు. అయితే ఇదే ఫైనల్‌ డిజైన్ కాదని తెలిపారు.

ఈ సీఎంఎఫ్‌ ఫోన్ 1 హ్యాండ్‌సెట్ బడ్జెట్‌ ధరలోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు ఇతర వివరాలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూలై నెలలో ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nothing sub brand CMF phone 1 concept image shared and here are the leaked key details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X