నథింగ్ సబ్‌బ్రాండ్ CMF తొలి ఫోన్ ఆసక్తికర టీజర్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!!
నథింగ్ సబ్ బ్రాండ్ CMF తొలి స్మార్ట్‌ఫోన్ CMF ఫోన్ 1 (CMF phone 1) .. భారత్‌లో త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన సంస్థ టీజర్‌ను విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక లీక్‌లు వచ్చాయి. ఈ CMF స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ సీఎంఎఫ్ స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇయర్‌బడ్స్ మరియు స్మార్ట్‌వాచ్ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ ఆధారంగా కీలక విషయాలు వెల్లడయ్యాయి.
తాజా టీజర్ ఆధారంగా ఈ CMF స్మార్ట్‌ఫోన్ రొటేటింగ్ డయల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వీడియోలో మ్యాటీ బ్లాక్ ఫినిష్ కలిగిన వెనుక ప్యానల్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ టీజర్ ఆధారంగా CMF బడ్స్ 2 మరియు CMF వాచ్ ప్రో 2 కూడా విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ డయల్‌ను మీడియా ప్లేబ్యాక్ మరియు వాల్యూమ్ (సౌండ్) ను నియంత్రించేందుకు ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.

CMF బడ్స్ 2, CMF వాచ్ ప్రో 2 విడుదలపై CMF సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం CMF ఫోన్ 1.. ఇటీవల విడుదల అయిన నథింగ్ ఫోన్ 2a కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ సీఎంఎఫ్ ఫోన్ 1.. జులైలో విడుదల కానుందని తెలుస్తోంది. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఇప్పటికి వరకు లీకైన వివరాల ఆధారంగా CMF ఫోన్ 1.. 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ సహా థిక్ బెజెల్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక కవర్ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) తయారుచేయబడుతుంది. వెనుక గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా సహా 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.
దీంతోపాటు ఈ సీఎంఎఫ్ ఫోన్ 1.. Nothing OS 2.6.0 తో పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వెర్షన్ అందుబాటులో లేదు. మరియు మీడియాటెక్ డైమెన్సటీ 7200 SoC పైన పనిచేస్తుందని తెలుస్తోంది. గరిష్ఠంగా 6GB ర్యామ్ సహా 128GB మరియు 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చనని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








